ఇప్పుడొక ఊరు పేరు తమ ఎంపీ పేరును పెట్టేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఈ ఘనతను సాధించింది ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవిత పేరును.. తమ గ్రామానికి పెట్టుకొని తమ అభిమానాన్ని ప్రదర్శించారు ఖానాపూర్ గ్రామస్తులు. ఇంతకీ.. తమ ఊరుకు ఉన్న పేరును మార్చేసి ఎంపీ కవిత పేరు పెట్టటానికి కారణం ఏమిటి? అంతగా ఆమె ఏం చేశారన్న విషయానికి వెళితే.. ఆమె చేసిన సాయమే అందుకు కారణంగా చెబుతున్నారు.
నిజామాబాద్ ఎంపీగా వ్యవహరిస్తున్న కవిత.. తన నియోజకవర్గం పరిధిలోని అర్మూరు మండలం ఖానాపూర్ గ్రామాన్ని కవితాపురంగా మార్చుకుంటూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకిలా అన్న విషయాన్ని గ్రామస్థులు చెప్పుకొచ్చారు. గోదావరి నదిపై నిర్మించే ఎస్ ఆర్ ఎస్పీ ప్రాజెక్టు తమ ఊరినిముంపుప్రాంతంగా మార్చేయనుంది. ఈ నేపథ్యంలో తమ గ్రామాన్ని ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు ఎంపీ కవిత కల్పించుకొని.. ఊళ్లో ఉన్న 274 ఇళ్లను.. గ్రామానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న చోట పునరావాసం కల్పించటంతో.. వారంతా ఆమె పేరునే తమ గ్రామానికి పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
ఇటీవల తామంతా ఎంపీ కవితను కలిసి తమకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించాలని కోరామని.. ఆమె సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల పరంగా ఇప్పటికీ ఆ గ్రామాన్ని ఖానాపూరంగా వ్యవహరిస్తున్నా.. గ్రామస్తులు మాత్రం బ్యానర్లలో ‘కవితాపురం’’ అని పేరు పెట్టుకోవటం విశేషంగా చెప్పాలి. రానున్న రోజుల్లో మరెన్నీ కవితాపురాలు.. కేటీఆర్ పురాలు వెలుస్తాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/