అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి !

Update: 2021-02-11 07:30 GMT
అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు వికారాబాద్  కి చెందిన వాడు కాగా... రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై ,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే

 అమెరికాలో జరిగిన ఘోరా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వికారాబాద్‌ యువకుడు కన్నుమూశాడు. స్థానిక గంగారం కాలనీకి చెందిన ఆది వినోద్‌కుమార్‌-హిమజ్యోతి దంపతుల కుమారుడైన నిఖిల్ ఏడేళ్ల కిందట అమెరికా వెళ్లారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ ‌గా ఉద్యోగం చేస్తూ అక్కడి యువతిని ప్రేమవివాహం చేసుకున్నారు. పది రోజుల కిందట నిఖిల్‌ కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. నిఖిల్‌ను ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహం గురువారం వికారాబాద్‌ చేరుకోనుంది.
Tags:    

Similar News