ఆ రూల్‌ వస్తే నెటిజన్లకు సంకెళ్లే

Update: 2015-04-13 17:26 GMT
స్వేచ్ఛా ప్రపంచానికి నిలువెత్తు నిదర్శనంగా భావించే ఇంటర్నెట్‌కు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా త్వరలో తీసుకుంటుందని భావిస్తున్న నిబంధనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది.

ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే కొన్ని సేవల్ని నిలిపివేయాలని.. లేదంటే.. ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయాలని ట్రాయ్‌ భావిస్తోంది. వాట్సాప్‌.. స్కైప్‌ లాంటి కొన్నింటిని నిషేధించాలని లేదంటే.. వాటికి ఛార్జీలు వసూలుచేయాలని ట్రాయ్‌ భావిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సామాన్యులకు రాజకీయనాయకులు.. సెలబ్రిటీలు.. మేధావులు.. విద్యావంతులు గొంతు కలుపుతున్నారు. ఇప్పుడు ఏదైతే విధానాన్ని అమలు చేస్తున్నారో.. దాన్నే పాటించాలని కొత్త రూల్స్‌ తీసుకురావద్దంటూ సేవ్‌ ద ఇంటర్నెట్‌ అంటూ ట్రాయ్‌కు లక్ష ఈమొయిల్స్‌ పంపారు. ఇంటర్నెట్‌కు సంకెళ్లుగా మారే.. ఈ కొత్త నిబంధనలు వద్దని వారు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై ట్రాయ్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో..?
Tags:    

Similar News