తెలుగు అకాడమీ కుంభకోణంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఈ కుంభకోణంలో నిందితులందరూ నీకు కొంచెం నాకు కొంచెం అన్న రీతిలో కమీషన్లతో అకాడమీ సొమ్ము మొత్తాన్ని స్వాహా చేసేశారు. ఎఫ్ డీలు ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీకి, అక్కడి నుంచి అగ్రసేన్ బ్యాంకుకు బదిలీ అయినప్పటి నుండి నగదు రూపంలో విత్ డ్రా అయ్యేదాకా, మొత్తం కమీషన్ల పైనే నడిచిందని సీసీఎస్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తును సీసీఎస్ పోలీసులు ముమ్మరం చేశారు. ఏ2గా ఉన్న రాజ్ కుమార్ పట్టుబడ్డ నేపథ్యంలో మిగతా నిందితులతో కలిపి అతణ్ని విచారించేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే అరెస్టయిన ఏ1 మస్తాన్‌వలీ, ఏ3 సత్యనారాయణ రావు, ఏ4 పద్మావతి, ఏ5 మొహియుద్దీన్‌ల కస్టడీకి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు వారం రోజుల కస్టడీని కోరగా ఈ పిటిషన్ పై విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఇక అరెస్టయిన నలుగురు నిందితులు సోమవారం బెయిల్ కోసం దరఖాస్తులు చేశారు. వీటిపైనా నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ జరపనుంది. బెయిల్ రాకుండా సీసీఎస్ పోలీసులు బలమైన కౌంటర్ పిటిషన్ ను సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు నేరశైలి ఎఫ్ డీలను అక్రమ పద్ధతుల్లో, నకిలీ పత్రాలతో విత్ డ్రా చేసుకోవడంపై బలమైన ఆధారాలు సంపాదించిన సీసీఎస్ పోలీసులు, నిందితులు కొల్లగొట్టిన రూ. 63.47 కోట్లు ఎక్కడున్నాయనేదాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. మస్తాన్ వలీ, రాజ్ కుమార్ లు తాము కొట్టేసిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇంతకు ముందు పోలీసులు జరిపిన విచారణలో.. ఏ4గా ఉన్న ఏపీ మర్కంటైల్ క్రెడిట్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ పద్మావతి 10ు కమీషన్(రూ. 6.347 కోట్లు)ను చైర్మన్ సత్యనారాయణకు పంపినట్లు స్పష్టం చేశారు.
అదే విషయంపై సీసీఎస్ పోలీసులు సత్యనారాయణను ప్రశ్నించగా. నాకేపాపం తెలియదు. అప్పులు తీర్చొచ్చనే కక్కుర్తికొద్దీ వారికి సహకరించాను. నాకు దక్కింది ఒక్క శాతమ, అంటే.. రూ. 63.47 లక్షలే , మిగతా 9 శాతంలో మధ్యవర్తిగా ఉన్న సోమశేఖర్ తీసుకున్నాడు. మరో మధ్యవర్తికి కూడా కొంచెం దక్కింది అంటూ సోమశేఖర్ ఇచ్చాడు. మొత్తం డబ్బును నగదు రూపంలో ఇచ్చినందుకు అగ్రసేన్ బ్యాంకు వారు కమిషన్ తీసుకున్నారు అని చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా, తనకు ముట్టిన వాటాలో రూ. 20 లక్షలు తన అగ్రసేన్ బ్యాంకు ఖాతాలో ఉన్నాయని, మరో 27లక్షలను విజయవాడ బ్రాంచ్ ఆర్బీఎల్ బ్యాంకులో పెట్టానని చెప్పినట్లు తెలిసింది.
గత ఏడాది మార్చిలో ముంబైలో కొందరు దుండగులు తనను కిడ్నాప్ చేసి రూ. 32 లక్షలు కొల్లగొట్టారని, నవీ ముంబైలోని కామోఠీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని, ఆ డబ్బు ఇంకా వెనక్కి రాలేదని చెప్పినట్లు సమాచారం. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు చేసిన అప్పును కమీషన్ లోని మిగతా మొత్తాన్ని వెచ్చించినట్లు పోలీసులకు చెప్పాడని తెలిసింది. ఈ నేపథ్యంలో అరెస్టయిన నిందితులందరినీ కలిపి విచారిస్తేగానీ, నిజానిజాలు తెలియవని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు. డబ్బు మొత్తం రికవరీ కావాలంటే.. నలుగురు నిందితుల కస్టడీ ఇప్పుడు అత్యంత కీలకమని చెబుతున్నారు.
మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మస్తాన్‌వలీ విచారణ సందర్భంగా సోమశేఖర్, శ్రీనివాస్ అనే పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారిద్దరు ఎవరు? అనే కోణంపై సీసీఎస్ పోలీసులు దృష్టిసారించారు. మొహియుద్దీన్ అగ్రసేన్ బ్యాంకు నుంచి డబ్బును డ్రాచేసి, తీసుకువచ్చాక.. సోమశేఖర్ ద్వారా శ్రీనివా్‌సకు అందజేసినట్లు తెలుస్తోంది. వారిద్దరూ అరెస్టయితే.. అసలు డబ్బు ఎక్కడుంది? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది.