ప్రస్తుత రోజుల్లో యువత క్షణికావేశం లో ఆత్మహత్య కి పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకొని ఏమి సాధించలేమని , ఏదైనా కూడా బ్రతికి ఉండే సాధించాలని తెలుసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ఉపాధ్యాయులు తిట్టారనో యువకులు ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రేమ విఫలమవుతున్న సందర్భాల్లో కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఉన్నత చదువులు చదివేందుకు కెనడాలో ఓ తెలంగాణ విద్యార్థి ఈ రోజు ఆత్మహత్యకి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లాలోని డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు అనే విద్యార్థి ఉన్నత చదువుల కోసం ఆరేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. అయితే, ఏం కష్టం వచ్చిందో.. ఈ రోజు ఉదయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కెనడా దేశంలో చదివుకునేందుకు వెళ్లిన నల్లగొండ విద్యార్థి చేసిన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ..
నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతి దంపతులకు ప్రవీణ్ రావు అనే కుమారుడు ఉన్నాడు. ప్రవీణ్ రావు ఉన్నత విద్యాభ్యాసం కోసం 2015వ సంవత్సరంలోనే కెనడాకి వెళ్లాడు. ప్రవీణ్ రావు తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. అయినప్పటికీ , వ్యవసాయం చేస్తూనే కొడుకును ఆ తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఉన్నత ఆశయాలతో తమ కుమారుడు కెనడాకు వెళ్లి చదువుకుంటున్నాడని వారు చెప్పారు. కలను నెరవేర్చుకోవాలనుకున్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ వారు విలపించారు. ప్రతి రోజూ ఒక్కసారైనా కెనడాలో ఉన్న కొడుకుతో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక్కసారిగా గురువారం ఉదయం తాను ఉంటున్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కెనడాలోనే కాలేజీలోనో, తన స్నేహితులతోనో ఏదో జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని వీలయినంత త్వరగా స్వస్థలానికి తెప్పించేలా అధికారులు కృషి చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.