ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కరోనాకు టీకా వచ్చేయటం.. అది కూడా ఒకటికి మూడు నాలుగు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్ లు వివిధ దేశాలకు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే.. ఈ టీకాలు వేయించుకున్న వారిలో కొత్త భయం.. ఆందోళనలు కలిగేలా వార్తలు వస్తున్నాయి. కొందరు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత.. సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయని.. ముఖ పక్షవాతానికి గురైనట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కొత్త టెన్షన్ పుడుతోంది. అయితే.. సైడ్ ఎఫెక్టు అందరికి కాదు.. కొందరికే అని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వేయించుకున్న వారి అనుభవం ఎలా ఉంది? టీకా వేయించుకున్న తర్వాత ఏమైంది? లాంటి సందేహాలను తీర్చేందుకు కొందరు తెలుగువారు ముందుకు వస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఈ తెలుగుప్రముఖులు.. తమ అనుభవాల్ని మీడియాకు చెబుతున్నారు. తాజాగా బ్రిటన్ లోని తెలుగు వైద్యులు.. అక్కడ చాలా ప్రముఖుడైన డాక్టర్ వెలగపూడి బాపూజీరావు తాజాగా టీకా వేయించుకున్నారు.మరి.. ఆయన అనుభవం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే..
- నేను ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. దాదాపు 20 వేల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను షురూ చేశారు. మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఈ వ్యాక్సిన్ కు అనుమతిని ఇచ్చింది. యూకేలో 70 కేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్నిషురూ చేశారు.
- టీకా వేయించుకోవాలంటే కాసింత ప్రాసెస్ ఉంది. తొలుత అపాయింట్ మెంట్ తీసుకోవాలి. ఇందుకు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి. వారు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళ్లాలి. వ్యాక్సిన్ వేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత చూస్తారు. కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లాంటి ప్రశ్నలు కొన్ని వేస్తారు. ఇటీవల ఏమైనా వ్యాక్సిన్లు తీసుకున్నారా? అని అడుగుతారు. ఎందుకంటే.. ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్న నెల వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకూడదు.
- అలర్జీలకు సంబంధించిన ప్రశ్నలుకూడా వేశారు. అలర్జీలు ఉన్న వారికి సమస్యలు వస్తున్నాయి. తొలుత సమస్యలు వచ్చినా.. వారిప్పుడు బాగానే ఉన్నారు. వ్యాక్సిన్ను మొత్తం నాలుగు గ్రూపుల వారికి ఇస్తున్నారు. మొదటి గ్రూపులో వైద్యులు.. వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. రెండో విభాగంలో హెల్త్ కేర్ సిబ్బందికి.. 80 ఏళ్లకు పైబడిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. మూడో గ్రూపులో 75 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తారు.నాలుగో గ్రూపులో 70 ఏళ్లకు పైబడిన వారు ఉంటారు.
- ప్రస్తుతం బ్రిటన్ లో పంపిణీ చేస్తున్న వ్యాక్సిన్ కేవలం కోటి మందికి మాత్రమే సరిపోతాయి. రానున్న మార్చి నాటికి 40 మిలియన్ల మందికి డోసులు ఇవ్వటమే లక్ష్యం. తొలిసారి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. రెండో డోస్ తీసుకున్నకొద్దిరోజుల తర్వాత ఇమ్యునిటీ వస్తుంది.
- వ్యాక్సిన్ వేసిన తర్వాత 15 నిమిషాల పాటు కుర్చీలో కూర్చోపెడతారు. సైడ్ ఎఫెక్టస్ కు సంబంధించి వివరాలు తెలుసుకుంటారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత కొంతమందిలో 24 గంటల్లో జ్వరం.. తలనొప్పి.. ఇతర ఇబ్బందులు ఐమేనా ఉంటే.. వెంటనే వైద్య సాయాన్ని అందిస్తారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఎదురైతే పారాసిటమాల్ సరిపోతుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కాసిన్ని కరోనా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
- ప్రస్తుతం ఫ్లూ వ్యాక్సిన్ మాదిరే.. కరోనా వ్యాక్సిన్ కూడా ఏడాదికి ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది. గర్భిణులు.. ఇమ్యునిటీ తక్కవగా ఉన్న వారికి వ్యాక్సిన్ వేయరు. కరోనా కారణంగా తీవ్రమైన మానసిక ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది. ఈ వైరస్ బారిన పడిన వారు ఇంట్లో వారితో గతంలో మాదిరి కలవలేకపోతున్నట్లు వెల్లడించారు. అలాంటి వారిలో పెద్ద వయస్కులు ఉంటే.. వారికి ఒంటరితనం తీవ్రంగా వేధిస్తుందని చెప్పక తప్పదు.