తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా అభ్యర్ధుల ఎంపిక లో బిజీగా ఉంది. దాని వెనక చాలా కసరత్తు కూడా చేస్తోంది. చంద్రబాబు అయితే నియోజకవర్గాల వారీగా అందరినీ కూర్చోబెట్టుకు ని మంతనాలు కూడా చేశారు. ప్రతీ నియోజకవర్గాన్ని లోతుగా అధ్యయనం చేశారు. అక్కడ ఎవరికి పట్టుంది, ఎవరికి మైనస్ ఉంది. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నారని అంటున్నారు.
దాంతో తన దగ్గర ఉన్న వివరాలు, అభ్యర్ధుల డేటా, సర్వేలు వీటి ఆధారంగా బాబు చాలా చోట్ల అభ్యర్ధులు ఎవరో వారికి చెప్పేసి ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అంటున్నారు. అలా లీక్ అయిన జాబితా చూస్తే కొన్ని పేర్లు బయట కు వస్తున్నాయి.
అలా శ్రీకాకుళం నుంచి చూస్తే ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ (సిట్టింగ్ ఎమ్మెల్యే), టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు ( ఏపీ టీడీపీ ప్రెసిడెంట్), ఆముదాల వలస కూన రవికుమార్, రాజాం కోండ్రు మురళీ మోహనరావు, విజయనగరం పూసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల కర్రోతు బంగార్రాజు, బొబ్బిలి బేబీ నాయన, చోడవరం కే ఎస్ ఎన్ రాజు, నర్శీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, పాయకరావు పేట వంగలపూడి అనిత, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ తూర్పు వెలగపూడి రామక్రిష్ణ బాబు (సిట్టింగ్ ఎమ్మెల్యే), విశాఖ పశ్చిమ పెతకంశెట్టి గణబాబు (సిట్టింగ్ ఎమ్మెల్యే) ఉన్నారు.
అయితే ఉత్తరాంధ్రాలో మొత్తం 34 మంది ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఇందులో పదమూడు పేర్లను మాత్రమే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలినవి రెండు వంతులు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటి అన్నది చర్చకు వస్తోంది. అయితే ఇవేమీ పేచీ పూచీ లేని సీట్లు అని అంటున్నారు. ఇక అభ్యర్ధుల మధ్యన పోటీ ఉన్న సీట్లు కొన్ని ఉంటే పొత్తుల లో జనసేన కు కోరుకునే సీట్లు మరి కొన్ని ఉన్నాయని, అలాగే బీజేపీ కనుక జట్టు కడితే వారికి ఇవ్వాల్సిన సీట్లు కూడా చూసుకుని అపుడు మిగిలిన వాటి విషయం లో ఫైనల్ లిస్ట్ పెడతారు అని అంటున్నారు.
అలా కనుక చూసుకుంటే గాజువాక, భీమిలీ విశాఖ సౌత్, నార్త్, అనకాపల్లి, ఎలమంచిలి. మాడుగుల, పాడేరు, అరకు వంటివి విశాఖ లో తేల్చలేదు. విజయనగరం లో చూస్తే ఎస్ కోట, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు వంటివి ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా లో శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం, పాలకొండ, పలాసా వంటివి ఉన్నాయి. మరి చంద్రబాబు వీటి విషయం లో ఏ నిర్ణయం తీసుకుంటారో అంటున్నారు. ఇక ఇపుడు ప్రకటించిన లిస్ట్ నిజమేనా లేక లీక్ అయినది ఫేక్ న్యూస్ నా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.