వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అధ్యాత్మిక గురువు నిత్యానంద మరోమారు వార్తల్లోకి రావటం తెలిసిందే. పలు కేసుల్లో చిక్కుకున్న ఆయన.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోవటమే కాదు.. తన సొంత దేశమంటూ కైలాశ దేశాన్ని ప్రకటించుకున్నారు. ఆ దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ద్వారా వీడియోల్ని రిలీజ్ చేస్తున్నారు. తన కైలాశ దేశానికి సొంత కరెన్సీ.. జాతీయ జెండా మొదలుకొని అన్నింటిని ఒకటి తర్వాత ఒకటిగా ప్రకటిస్తున్న ఆయన తీరు ఇప్పుడు సంచలనంగా మారాయి.
నిత్యానందపై లైంగిక వేధింపులతో పాటు.. కిడ్నాప్.. హత్య కేసులు కూడా నమోదయ్యాయి. బెంగళూరుకు చెందిన జనార్దన్ శర్మ గుజరాత్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన ఇద్దరు కుమార్తెల్ని కిడ్నాప్ చేసి.. అహ్మదాబాద్ ఆశ్రమంలో నిర్బంధించారని పేర్కొంటూ కిడ్నాప్ కేసు నమోదైంది. వరుస కేసుల నేపథ్యంలో పరారైన నిత్యానందను గుర్తించేందుకు ఇంటర్ పోల్ సాయం కోరారు. అయినప్పటికీ.. ఆయన ఎక్కడ ఉన్నది గుర్తించలేకపోవటం తెలిసిందే.
తన సొంత దేశానికి సంబందించిన కరెన్సీ వివరాల్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పిన నిత్యానంద మాటలకు తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారి రియాక్ట్ అయ్యారు.మధురైలోని టెంపుల్ సిటీ పేరిట హోటళ్లను నిర్వహించే కుమార్ అనే వ్యాపారి కైలాస దేశంలో ఒక హోటల్ ను ఏర్పాటు చేయాలని భావించారు. ఇదే విషయాన్ని ఆయన పేర్కొంటూ.. తనకు హోటల్ పెట్టే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కైలాస దేశానికి వచ్చే యాత్రికులు.. అతిధులకు నచ్చే విధంగా ఆహారాన్ని అందిస్తామని.. ఆ వచ్చిన డబ్బుతో కైలాస దేశ డెవలప్ మెంట్ కు సాయం చేస్తామన్నారు. తమిళ తంబి వ్యాఖ్యల్ని చూసినంతనే.. నిత్యానందకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కనిపించక మానదు. మరి.. ఈ తమిళ తంబి హోటల్ ప్రపోజల్ పై కైలాశ దేశాధ్యక్షుడు నిత్యానంద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.