గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చాంపియన్ షిప్ ల్లో ఒకటి.. వింబుల్డన్. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లను కలిపి గ్రాండ్ స్లామ్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం వింబుల్డన్ చాంపియన్ షిప్ యునైటెడ్ కింగ్ డమ్ రాజధాని లండన్ లో జరుగుతోంది. గత రెండేళ్లు చాంపియన్ గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ మరోసారి చాంపియన్ గా నిలుస్తాడనే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వింబుల్డన్ లోనూ తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా... 'ఆర్‌ఆర్‌ఆర్' క్రేజు కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఆర్‌ఆర్‌ఆర్ భారీ ఎత్తున కలెక్షన్లతో దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని 'నాటు.. నాటు' సాంగ్ ఆబాలగోపాలాన్ని అలరించింది. చివరకు ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును సైతం కొల్లగొట్టింది.
ఇప్పుడీ క్రేజు వింబుల్డన్ కు కూడా పాకింది. వింబుల్డన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఒక ఆసక్తికర పోస్టర్ ను పంచుకుంది. ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా ఉన్న కార్లోస్ అల్కరాజ్, ప్రపంచ నంబర్ టూ నొవాక్ జొకోవిచ్.. ఇద్దరూ కలిసి నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసినట్టుగా ఈ పోస్టర్ ను చిత్రీకరించారు.
వాస్తవానికి వింబుల్డన్ టోర్నీకి కొత్తగా ప్రచారం అవసరం లేదు. ఈ టోర్నీకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి టెన్నిస్ ప్లేయర్ జీవితంలో ఒక్కసారైనా ఈ కప్ ను గెల్చుకోవాలని ఆశిస్తారు. అయితే ప్రచారం కోసం కాకపోయినా 'నాటు నాటు' సాంగ్ క్రేజ్ నేపథ్యంలో వింబుల్డన్ ట్విట్టర్ హ్యాండిల్ లో కార్లోస్ అలక్ రాజ్, నొవాక్ జోకోవిచ్ లతో కూడిన పోస్టర్ ను పోస్టు చేసింది.
వింబుల్డన్ ట్విట్టర్ హ్యాండిల్ లో నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేస్తున్నట్టు పోస్టర్ కనిపించగానే దానికి భారీ ఎత్తున లైకులు, రీట్వీట్లు వచ్చాయి. అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లతో తమ స్పందన వ్యక్తం చేశారు. ఒక భారతీయ పాట.. ప్రపంచాన్ని ఊపేసి ఆస్కార్ అవార్డును కొల్లగొట్టడమే కాకుండా చివరకు వింబుల్డన్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీ వరకు పోస్టర్ రూపంలో వెళ్లడం గొప్ప విషయమే. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇదే విషయాన్ని తన ఇన్‌స్ట్రాగామ్ స్టోరీగా షేర్ చేయడం విశేషం.