వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. దెబ్బకు దిగివచ్చిన కేటీఆర్.. ముగిసిన చర్చలు
వీఆర్ఏలు కదం తొక్కారు. సీక్రెట్ గా అసెంబ్లీని ముట్టడించారు. ఇదివరకూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆర్మీ అభ్యర్థులు ఎలాగైతే ముట్టడించి విధ్వంసం చేశారు. ఇప్పుడూ అలానే వీఆర్ఏలు పకడ్బందీగా హైదరాబాద్ పోటెత్తారు. ఈసారి కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. విడతల వారీగా వీఆర్ఏలు ముందే హైదరాబాద్ వచ్చి అసెంబ్లీ ముట్టడిలో పాలుపంచుకున్నారు.
వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకుంటారన్న కారణంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ వీఆర్ఏల ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ ఇంటెలిజెన్స్ ఛలో అసెంబ్లీని పసిగట్టలేకపోయింది. మంగళవారం ఏడు సంఘాలు ఒకేసారి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వీఆర్ఏలు మూడు రోజులు ముందుగానే హైదరాబాద్ లోని బంధువుల ఇళ్లకు చేరుకున్నారు. మంగళవారం విడతల వారీగా 6వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం, కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడిలను కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోవడం గమనార్హం.
-వీఆర్ఏల డిమాండ్లు ఇవీ..
వీఆర్ఏల ముట్టడి ఉద్రిక్తంగా మారడంతో వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపారు. వీఆర్ఏలు ప్రధానంగా పే స్కేల్ విడుదల చేయాలని.. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని.. 56 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్స్ ను ప్రధానంగా కేటీఆర్ ముందు ఉంచారు.
-సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ
వీఆర్ఏలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపిన అనంతరం మాట్లాడారు. 15 మందితో భేటి అయిన కేటీఆర్ వారి డిమాండ్లు తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని.. ఈనెల 20న మరోసారి చర్చిద్దామని.. ఆందోళన విరమించాలని వారికి సూచించారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉన్న ఇతర వీఆర్ఏలతో చర్చించి తాము నిర్ణయం చెబుతామని వీఆర్ఏ ల ప్రతినిధులు మంత్రికి తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.