చేతులు వెనక్కికట్టి.. గొంతులు కోసి చంపేశారు.. పాక్​ లో ఉగ్రవాదుల దుశ్చర్య..!

Update: 2021-01-04 05:52 GMT
పాకిస్థాన్ ​లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అక్కడ నివాసముంటున్న మైనార్టీ తెగలైన హజారాలపై గత కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్​ ఉగ్రమూక.. తాజాగా దాష్టికానికి పాల్పడ్డారు. బొగ్గు గనుల్లో పనిచేస్తున్న హజారా తెగకు చెందిన కార్మికులను  ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. చేతులు వెనక్కినెట్టి..  గొంతుకోసి చిత్రహింసలు పెట్టి హతమార్చారు. అనేక ఏళ్ల క్రితం హజారా తెగకు చెందిన కొందరు ఆఫ్టనిస్థాన్​ నుంచి పాకిస్థాన్​కు వలస వచ్చారు.

వీళ్లంతా బలూచిస్థాన్‌ లో బొగ్గుగనుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఆదివారం ఉదయం కొందరు ఉగ్రవాదులు బలూచిస్థాన్​ రాష్ట్రంలోని మూచ్​ పట్టణంలోకి చొరబడ్డారు. అక్కడ పనిచేస్తున్న 11 మంది కార్మికులను కిడ్నాప్​ చేశారు. వారిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. అనంతరం చేతులు వెనక్కి కట్టి గొంతులు కోసి దారుణం గా హతమార్చారు. ఈ విషయంపై హజారా ఉద్యమహక్కుల కార్యకర్త అలీ రజా మాట్లాడుతూ.. బలూచిస్థాన్​ లో ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని ఆరోపించారు.

అయితే ఈ విషయంపై బలూచిస్థాన్ ప్రావిన్సుల హోం మంత్రి మిర్ జియుల్లాహ్ లాంగ్వ్ స్పందించారు.  ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఈ దుశ్చర్యకు పాల్పడిని వారిని వదిలిపెట్టబోమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ (ఐఎస్​ఐఎస్​) ప్రకటించింది. అయితే వందేళ్ల క్రితమే హజారా తెగకు చెందిన వాళ్లు ఆఫ్టనిస్థాన్​ వచ్చి బలూచ్​ ప్రాంతంలో స్థిరపడ్డారు.
 
వీరి జనాభా దాదాపు 2 లక్షలు ఉంటుంది. వీళ్లు పర్షియా భాషను మాట్లాడుతారు. వీళ్లకు మొదటినుంచి స్థానికులతో తగాదాలు ఉన్నాయి. అయితే తాజా ఘటనపట్ల హజరా తెగ ప్రజలు  తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.
Tags:    

Similar News