జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లో తుపాకీ దొంగతనం కేసు మరో కీలక మలుపు తిరిగింది. రెండు రోజుల క్రితం బీజేపీ నేత గులాం మహమ్మద్ చోపాన్ వ్యక్తిగత సెక్యూరిటీ నుంచి అనుమానిత తీవ్రవాదులు సర్వీస్ రైఫిల్ ను లాక్కువెళ్లినట్టు ఫిర్యాదు అందిన ఘటన కలకలం రేపింది. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా ఆరా తీయగా బీజేపీ నేత చోపాన్ స్వయంగా మిలిటెంట్లకు అత్యాధునిక ఏకే-56 రైఫిల్స్ ఇచ్చినట్టు తేలింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
తన ఇంటిలోకి దూసుకువచ్చిన మిలిటెంట్లు కాపలాగా ఉన్న బషీర్ అహ్మద్ పై దాడికి దిగి, అతని గన్ తీసుకుని పారిపోయారని చోపాన్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారించగా, ఇది ఇంటి దొంగల పనేనని తేలింది. అసలు ఆ సమయంలో సెక్యురిటీ బషీర్ విధుల్లోనే లేడని, అతని తుపాకిని మాత్రం చోపాన్ ఇంటి వద్ద ఉంచారని తేల్చారు. అంతేకాకుండా బీజేపీ నేత ఇంటికి కొంతమంది సందర్శకుల రూపంలో ఉగ్రవాదులు రాగా, తుపాకిని వారికి ఇచ్చి పంపినట్టు స్పష్టం చేశారు. ఆపై అనుమానిత మిలిటెంట్లు బైకు లపై పారిపోయారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చోపాన్ ను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబడతామని పోలీసులు వెల్లడించారు.