దాయాది దుర్మార్గం రోజురోజుకీ మారిపోతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్ని వెతుకుతూ.. దేశంలో ఏదోరకంగా చిచ్చుపెట్టాలని చూస్తోంది. అక్రమంగా సరిహద్దుల్ని దాటి వచ్చేందుకు ఇప్పటివరకూ ఉన్న మార్గాల్ని మోడీ సర్కారు మూసేస్తున్న వేళ.. సరిహద్దులు మరింత కట్టుదిట్టంగా మారిన వేళ సరికొత్త ఎత్తుల్ని వేస్తోంది. తాజాగా జమ్మూ సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదుల్ని బీఎస్ ఎఫ్ దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే.
కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన తర్వాత కూడా ఉగ్రవాదులు సరిహద్దులు దాటిన వైనంపై సైనిక వర్గాలు దృష్టి సారించాయి. ఈ సందర్భంగా షాకింగ్ అంశాల్ని గుర్తించారు. భారత్ – పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని సొరంగ మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తించారు. వ్యవసాయ పొలాల కింద రెండు మీటర్ల ఎత్తు.. రెండు మీటర్ల వెడల్పు.. 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించిన విషయాన్ని బీఎస్ ఎఫ్ డీజే కేకే శర్మ వెల్లడించారు. ఆయన చెప్పిన మాటలు విన్న వెంటనే ఆ మధ్య విడుదలై.. భారీ విజయాన్నిసాధించిన బాలీవుడ్ సినిమా భజరంగీ భాయి జానే గుర్తుకు రాక మానదు. ఇందులో కథానాయకుడు పాక్ సరిహద్దుల్లోకి రహస్యంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు.. సొరంగ మార్గంలోకి వెళ్లటం గుర్తుకు వస్తుంది.
సరిగ్గా ఇదే విధానాన్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనుసరిస్తుండటం గమనార్హం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడుకున్న టెక్నాలజీ ప్రకారం సొరంగాల్ని గుర్తించే వీలు లేదని సైనిక వర్గాలు చెబుతున్నాయి. విస్తృతంగా తనిఖీలు నిర్వహించటం మినహా మరో మార్గం లేదన్నది అధికారుల మాట. గతంలో మాదిరి ఆక్రమంగా కంచెల్ని దాటటం.. సరిహద్దుల వద్ద కంచె బలంగా లేని చోట్ల.. సైనికుల కన్ను గప్పి దేశంలోకి ప్రవేశించటం కష్టంగా మారిన వేళ.. సొరంగ మార్గాల్లో దేశంలోకి అడుగు పెడుతున్న వైనంపై మోడీ సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/