తమిళనాడులో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో.. రాజకీయ పార్టీలతోపాటు.. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లిన కమల్ హాసన్, రజనీకాంత్ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా తమ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ప్రముఖ కోలీవుడ్ హీరో తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఎన్నికలకు ఏడాది కాలమే ఉండడంతో సినిమాల్లోంచి పాలిటిక్స్ లోకి వెళ్లిన కమల్ హాసన్ ఇప్పటికే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రజనీ కాంత్ కూడా తన పార్టీని ప్రకటించే పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 17న ‘మక్కల్ సేవై కచ్చి’ని ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ రాజకీయ అరంగేట్రం అంటూ.. ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారాన్ని బలం చేకూర్చే విధంగా.. విజయ్ తన అభిమానులతో సమావేశమవడం చర్చనీయాంశం అయ్యింది. చెన్నై శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో తన అభిమానుల క్లబ్ ‘మక్కల్ ఇయక్కం’ సభ్యులతో తలపతి మీటింగ్ పెట్టారు. అయితే.. తన పొలిటికల్ ఎంట్రీపై ఏదైనా ప్రకటన వస్తుందేమోనని అనుకున్నప్పటికీ అలాంటిది జరగలేదు.
ఈ సమావేశంలో.. తన అభిమానులకు ఒక సూచన చేశాడంట విజయ్. ఎన్నికలకు చాలా సమయం ఉన్నందు వల్ల.. ఇప్పుడే ఇతర పార్టీలకు మద్దతుగా వెళ్లొద్దని అభిమానుల తలపతి కోరాడట. ఈ ప్రకటనపై పలు విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అభిమానులను వేచి ఉండమన్నాాడంటే.. ఎన్నికల కొన్నివారాల ముందు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. మరి, ఈ కోలీవుడ్ హీరో అలా ఎందుకు చెప్పాడు? రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అన్నది వేచి చూడాలి.