మాకు ఒక నాయకుడు కావాలంటున్న ఓ పెద్ద పార్టీ

Update: 2020-02-15 21:30 GMT
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏపీలోని రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటాయి.. ఎత్తుకు పైఎత్తులతో నిత్యం రసకందాయంగా మారుతుంటాయి. ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. అయితే ఇలాంటివి తట్టుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు అధికార పార్టీ దెబ్బకు ఓ పార్టీ కకావికలం అవుతోంది. దెబ్బ మీద దెబ్బ పడుతుండడంతో ఇక పార్టీ కోలుకోలేని విధంగా తయారవుతోంది. ఇటీవల జరిగిన ఓ పరిణామం ఆ పార్టీ అధినేత ప్రజల్లో ఉండే అవకాశం లేకుండాపోయింది. ఈ పరిణామానికి ఫలితం జైలుకు పోతే మరీ పార్టీని నడిపించేది ఎవరు అనే ప్రశ్న మొదలైంది. రాష్ట్రంలో ఆయన వారసుడు ఉన్నా కూడా రాజకీయ వారసుడిగా గుర్తించడం లేదు. దీంతో పార్టీ అధినేత రాజకీయ వారసుడు ఎవరు? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమకు ఒక నాయకుడు కావాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఇటీవల నిధుల బదలాయింపు అంశం సీఐడీ, ఈడీ, ఐటీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ఆ తర్వాత విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ చర్యలంటూ తీసుకుంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అధినేతపైనే పడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ కేసులు చాలా తీవ్రమై ఆయన్ను జైలుకు పంపించే అవకాశం కూడా ఉంది. అయితే ఆయన జైలుకు వెళ్తే రాష్ట్రంలో పార్టీకి దిక్కెవరనే ప్రశ్న మొదలైంది. ఆయన పుత్రరత్నం ఉన్నా డమ్మీగానే ఉన్నాడు. తెలుగు రాదు.. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు.. ముఖ్యంగా రాజకీయ నాయకుడి లక్షణాలు లేవు.. అంత చరిష్మా లేదు. దీంతో అతడిని నమ్ముకుంటే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రిగా చేసిన ఆ వారసుడు ఇంకా రాజకీయాల ఓనమాలు కూడా నేర్వలేదని పార్టీ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. ఏదో పార్టీ అధినేత ఉండడంతో అతడికి ఆ మాత్రం గౌరవం ఇస్తున్నారు. ఒక్కసారి ఆయన జైలుకు పోతే పుత్రరత్నం ఏకాకి అవుతాడు. అతడిని ఎవరు పట్టించుకోనే పరిస్థితి లేదు. అధికారం ఉన్నన్నాళ్లు పదవులు, టెండర్లు, కాంట్రాక్టులు కోసం దండాలు పెట్టారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో అతడికి ఇచ్చే గౌరవం తగ్గుతోంది. ఇక పార్టీ అధినేత బందీ అవుతే వారసుడిని గాలికొదిలేసే అవకాశం ఉంది.

ఆ వారసుడు ఎలాగో డమ్మీ.. కానీ ఇప్పుడు రాజకీయ వారసుడు ఎవరు? పార్టీని నడిపేదెవరు అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. అందుకే తమకో నాయకుడు కావాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకే పార్టీలో ఎవరు అంతటి బాధ్యతలు మోయగలరో.. చాకచక్యం, మాటల్లో నేర్పరితనం, దూకుడుతనం ఉన్న నాయకుడు కావాలని ఆశిస్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. ఈ విధంగా పార్టీ నాయకులు భావిస్తుండడంతో అసలు వారసుడు, పుత్రరత్నం భవిష్యత్ ఇంతేనా అనిపిస్తోంది. ఇక్కడితోనే ఆగిపోయేట్టు తెలుస్తోంది. మరీ దీనికి సమాధానం భవిష్యత్ పరిణామాలే చెబుతాయి.
Tags:    

Similar News