ఆ బాలీవుడ్ సినిమా చూసే.. కిడ్నాప్ స్కెచ్!

Update: 2021-01-13 04:03 GMT
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మరో విషయం వెలుగుచూసింది. ఇందులో కొత్త విషయాలు  హాట్ టాపిక్ గా మారాయి.

బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో వచ్చిన ‘స్పెషల్ 26’ అనే సినిమా చూసే కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు ఇందుకోసం స్కెచ్ సిద్ధం చేశారు. కిడ్నాపర్లకు ఆ సినిమా చూపించి.. ఐటీ అధికారులుగా నటించేందుకు వారం పాటు ట్రైనింగ్ ఇచ్చారట..

ఈ క్రమంలోనే ఆఫీసర్లుగా ఐడీ కార్డులు సృష్టించి.. సినిమా కంపెనీ నుంచి కాస్ట్యూమ్స్ తెచ్చి కిడ్నాప్ నకు పాల్పడ్డారు.

ఇందులో భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ కీలకంగా ఉన్నట్లు అఖిలప్రియ విచారణలో తెలిపింది. మొత్తానికి ఏకంగా సినిమాలు చూసి మరీ కిడ్నాప్ డ్రామా ఆడారంటే వీళ్ల పనితనం ఎంతో అర్థం చేసుకోవచ్చు. సినిమాలు, సీరియళ్లు క్రిమినల్స్ కు ఎంతగా ఉపయోగపడుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News