సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో అతి పెద్దదైన 16వ బ్యాంక్. ఎన్నో స్టార్టప్ లకు అండగా నిలిచి.. వారు దూసుకెళ్లేందుకు అవకాశం కల్పించిన బ్యాంక్. ఇప్పుడా బ్యాంకు కేవలం 48 గంటల్లో మునిగిపోయింది. ఇదో ఉత్పాతంలా మారితే.. మరో పెద్దదైన అమెరికా బ్యాంకు సిగ్నేచర్ బ్యాంకు దివాలా తీసింది. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా కొత్త భయాలు మొదలయ్యాయి. ఈ రెండు బ్యాంకులు కుప్పకూలిపోవటంతో.. ఆ ప్రబావం తమ దేశంలోని బ్యాంకుల మీద పడుతుందన్న భయాందోళనలు మొదలయ్యాయి.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ రుణ పత్రాలు.. బాండ్లు డౌన్ గ్రేడ్ చేయనున్నట్లుగా రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ నుంచి అందిన సమాచారం బయటకు పొక్కటం.. మూడీస్ నుంచి వచ్చిన సమాచారంతో చోటు చేసుకున్న పరిణామాలతో కేవలం 48 గంటల వ్యవధిలో అంత పెద్ద బ్యాంకు కుప్పకూలిపోగా.. మరో పెద్దదైన సిగ్నేచర్ బ్యాంకు దివాలా దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఎందుకిలా జరిగింది? అన్న ప్రశ్నలు వేసినప్పుడు బోలెడన్ని సాంకేతిక అంశాల్ని కోకొల్లలుగా చూపిస్తారు. అలా కాకుండా అర్థమయ్యే భాషలో ఏం జరిగిందన్నది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఒక పెద్ద బ్యాంకు కేవలం 48 గంటల్లో ఎలా కుప్పకూలిందన్న విషయాన్ని సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఆ బ్యాంకు చేసిన ఒక తప్పు ఇంతటి విపత్తుకు కారణమని చెప్పాలి. అదేమంటే.. బ్యాంకింగ్ సహజ సూత్రాలకు భిన్నంగా వెళ్లటమే ఆ బ్యాంకు చేసిన అతి పెద్ద తప్పుగా చెప్పాలి.
40 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. స్వల్పకాలిక డిపాజిటర్ల సొమ్మును తీసుకొని.. ఆ డబ్బును దీర్ఘకాలిక రుణాలుగా వేరే వారికి అప్పుకు ఇచ్చాయి. ఇది సహజ బ్యాంకింగ్ సూత్రాలకు విరుద్ధం. మన భాషలో చెప్పాలంటే.. మీకు పది మంది వ్యక్తులు నెలలో మీరు తిరిగి ఇచ్చేందుకు వీలుగా రూపాయి వడ్డీకి లక్ష చొప్పున ఇచ్చారనుకుందాం. దాన్ని మీరు రెండు రూపాయిల వడ్డీకి మరో పది మందికో లేదంటే ఐదు మందికో.. అదేమీ కాదంటే ముగ్గురికి ఏడాది తర్వాత తిరిగి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? నెల అయ్యేసరికి మీరు చెల్లించాల్సిన వారికి తిరిగి ఇవ్వటానికి రూ.10 లక్షలు కావాలి. దాంతో పాటు.. వారికి ఇస్తామన్న వడ్డీ ఇవ్వాలి. ఇలాంటప్పుడు మీరేం ఆలోచిస్తారు. నెల రోజుల్లో ఇచ్చేందుకు మరికొంత మంది వద్ద ఇదే తరహాలో తీసుకొని ఇవ్వొచ్చని భావిస్తారు.
ఇలాంటి సమయంలో మీరు అంచనా వేసినట్లుగా డిపాజిట్లు రాకున్నా.. మీరు అప్పులు ఇచ్చిన వారు మీకు సకాలంలో ఇవ్వకున్నా.. మీ పరిస్థితి ఏమవుతుంది? ఈ చిన్న మొత్తాల్లో కాకుండా భారీ మొత్తాల్లో ఇలాంటి తప్పులు చేస్తే.. ఎంత బ్యాంకు అయితే మాత్రం ఇట్టే కుప్పకూలిపోతుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు చేసింది కూడా ఈ తరహా తప్పే.
డిపాజిటర్లు తాము డిపాజిట్ చేసుకున్న కాలానికే కాదు.. అవసరమైతే వెంటనే కూడా తమ డబ్బులు తమకుతిరిగి ఇచ్చేయాలని కోరచ్చు. అలా అడిగినప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే.. డిఫాల్టర్ గా మారుతుంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తాను చెల్లించాల్సిన చెల్లింపులు ఎక్కువగా ఉండటం.. తనకు రావాల్సిన డబ్బులు సరిగా రాకపోవటం లాంటి వ్యవహారం సిలికాన్ వ్యాలీ బ్యాంకును.. ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంకును దెబ్బ తీయటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.