తెలుగు దేశం పార్టీ నేత.. గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఇన్ చార్జి నరేంద్ర వర్మ మాజీ కారు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆయన మాజీ కారు డ్రైవర్ వీరేష్ తాజాగా నిద్రమాత్రలు మింగి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అయితే ఓ స్థల వివాదం నేపథ్యంలోనే టీడీపీ నేత నరేంద్ర వర్మ అనుచరులు బెదిరించారని అతడు మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.
వీరేష్ గతంలో టీడీపీ బాపట్ల ఇన్ చార్జి నరేంద్ర వర్మ దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. గతంలో నాలుగు సెంట్ల స్థలాన్ని వీరేష్ పేరుతో నరేంద్రవర్మ రాసినట్టు తెలిసింది. నమ్మకంగా పనిచేయడంతో అతడి పేరుమీదనే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడని సమాచారం.
అయితే ఇప్పుడు కారు డ్రైవర్ గా మానేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైనట్టు ప్రచారం జరుగుతోంది. తిరిగి ఆ స్థలాన్ని తన పేరుమీద రాయాలంటూ నరేంద్ర వర్మ అనుచరుల బెదిరింపులు దిగినట్టుగా సమాచారం.
దీంతో బాధితుడు వీరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు నరేంద్రవర్మతోపాటు ఆయన ముగ్గురు అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నారు.