తెల్లవారి లేస్తే.. సావార్కర్ జపం చేసే నరేంద్రమోడీ.. తన స్నేహితులు.. బలవంతులకు తల వొంచుతున్నారని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "మోడీతన బలవంతులైన మిత్రులకు సాయం చేస్తున్నారు. వారికి తలవొంచుతున్నారు. దీనిని ఆయన దేశభక్తిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. నీరవ్ మోడీని తీసుకువస్తానన్నారు. ఆయనకు తల వొంచారు. ఇప్పుడు అదానీకి దేశాన్ని అమ్మేస్తున్నారు. కానీ, ఇదంతా కూడా దేశ భక్తేనని చెప్పుకొంటున్నారు. ఇదీ.. మోడీ దేశానికి చేస్తున్న గొప్ప సేవ" అని రాహుల్ విరుచుకుపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీలో రాహుల్ ప్రసంగిస్తూ, మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బలవం తులకు తలవొగ్గడమే సావర్కర్ ఐడియాలజీ అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ సహా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని రాత్రికిరాత్రి నోటీసులు ఇచ్చి తరిమేశారని రాహుల్ చెప్పారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని చెప్పినప్పుడు ఎంత క్లిష్ట పరిస్థితిని తమ కుటుంబ ఎదుర్కోవాల్సి వచ్చిందో తనకు బాగా గుర్తుందని రాహుల్ అన్నారు.
భారత్ జోడో యత్రలో తనకు ఎదురైన అనుభవాలను, యాత్రకు లభించిన విశేష ప్రజాదరణను గుర్తుచేసుకున్నారు. భారత్ జోడో యాత్ర నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఉన్నారు. "నా దేశం కోసం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ నడిచాను. వేలాది మంది నాతోనూ, పార్టీతోనూ మమేకమయ్యారు. రైతుల సమస్యలన్నింటినీ విని, వారి బాధలేమిటో ఆకళింపు చేసుకున్నాను. మహిళలు, యువకుల ఆవేదనను అర్ధం చేసుకున్నాను. లక్షలాది మంది యాత్రలో మాతో కలిసి నడిచారు" అని వివరించారు.
మోడీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వం విద్వేష ప్రచారం ద్వారా దేశాన్ని ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో చివరిగా జమ్మూకశ్మీర్‌లో తాను అడిగనప్పుడు ముఖ్యంగా యువత ఎంతో ఆదరంగా ముందుకు వచ్చి కశ్మీర్‌లో పర్యటించినందుకు తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారని గుర్తు చేశారు. కశ్మీర్‌లో మతం పేరుతో యువత వివక్షకు గురవుతోందని ఆరోపించారు. దీనికి కారణం ఎవరో ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.