పింక్ డైమండ్ ధర రూ. 197 కోట్లు.. అంత విశేషమెంటో తెలుసా!

Update: 2020-11-12 17:47 GMT
అత్యంత అరుదైన గులాబీరంగు రష్యా వజ్రం (పర్పుల్ పింక్ డైమండ్) రూ. 197.95 కోట్లు (26.6 మిలియన్ డాలర్లు) ధర రికార్డ్ స్థాయిలో పలికింది. అయితే ఇప్పటి వరకు వేలం వేసిన పింక్​ వజ్రాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. అందుకే దీని ధర కూడా అంతే స్థాయిలో పలికింది. సాధారణంగా గులాబీ  రంగు వజ్రాలు పది క్యారెట్లలోపే ఉంటాయి. కానీ ఈ  వజ్రం మాత్రం 14.8 క్యారెట్లు ఉంది. ఇలా ఉండటమే దీని ప్రత్యేకత అని ఈ రకం డైమండ్స్​ని రూపొందిన నిపుణులు అంటున్నారు. దీన్ని ‘ద స్పిరిట్ ఆఫ్ ద రోజ్’గా పిలుస్తున్నారు. దీని పరిమాణం ఎక్కువగా ఉండటం.. రంగు కూడా ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో ఈ వజ్రానికి భారీ ధర పలికింది.

 జెనీవాలో సౌథెబే ఈ డైమండ్​కు వేలం నిర్వహించారు. అయితే ఈ వజ్రం ఎంత ధరకు అమ్ముడుపోయిందో నిర్వాహకులు ఎవరు కొన్నారన్న విషయాన్ని దాచిపెట్టారు.  సదరు వ్యక్తి కోరికమేరకు అతడి పేరును బయటకు వెళ్లడించలేదని సమాచారం. కానీ భారీ మొత్తం  వెచ్చించి దీనిని కొనుగోలు చేసి ఉంటారని చెబుతున్నారు.రష్యా మైనింగ్ సంస్థ అల్రోసా సేకరించిన మూడు ప్రముఖమైన వజ్రాల్లో ఇదీ ఒకటి. 2017లో ఇది బయటపడింది. దీని ముడి వజ్రం పేరు నిజిన్‌స్కీ. రష్యా-పోలండ్ బ్యాలే డ్యాన్సర్ పేరును దీనికి పెట్టారు. గులాబీ వజ్రాల్లో అత్యధిర పలికిన రికార్డు ''సీటీఎఫ్ పింక్ స్టార్'' పేరిట ఉంది. 59 క్యారెట్ల ఈ వజ్రాన్ని హాంకాంగ్‌లో 2017 ఏప్రిల్‌లో వేలం వేశారు. ఇది రూ.528 కోట్ల(71 మిలియన్ డాలర్లు) ధర పలికింది.
Tags:    

Similar News