గన్నవరం విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

Update: 2021-02-20 14:15 GMT
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. తృటిలో మిస్ అయ్యింది. లేదంటే అపార ప్రాణ నష్టం సంభవించి ఉండేది. విమానం ల్యాండ్ అవుతుండగా పట్టు తప్పి జారిపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది
దోహా నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.

దీంతో అప్రమత్తమైన గన్నవరం ఎయిర్ పోర్టు అథారిటీ  సిబ్బంది విమాన ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేశారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ప్రమాద సమయంలో విమానంలో 63మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో గన్నవరంలో 19మంది ప్రయాణికులు దిగారు. మిగిలిన 45మంది తిరుచ్చానూరు వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
Tags:    

Similar News