ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే 16 సంవత్సరాల బాలికను 20 సంవత్సరాల యువకుడు విచక్షణా రహితంగా 40 సార్లు కత్తితో పాడిచాడు. అంతటితో ఆగకుండా బండరాయితో తలపై పలుసార్లు మోదాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరుగుతున్నా ఒక్కరూ ఆపకపోవడం గమనార్హం.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతం షహబాద్‌లో బాలిక(16) నివసిస్తోంది. సాహిల్ అనే యువకుడితో స్నేహం చేసింది. ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్నేహితురాలి కుమారుని పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు బాలిక బయలుదేరింది. ఈ సమయంలో ఆమెను అడ్డగించిన సాహిల్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన సాహిల్ వెంట తెచ్చిన కత్తితో బాలికను పాశవికంగా పొడవసాగాడు. ఏకంగా 40 కత్తిపోట్లు పొడిచాడు.
అంతటితో ఆగకుండా బండరాయి తీసుసుకుని ఆమె తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇదంతా అందరి కళ్లేముందే జరుగుతున్నా ఒక్కరూ నిలువరించే ప్రయత్నం చేయలేదు. అనంతరం నిందితుడు పారిపోయాడు. సిసి పుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించిన పోలీసులు ఘటన జరిగిన 18 గంటలోపే అరెస్టు చేశారు. హత్య జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. హత్యకు ముందు ఇద్దర మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాలిక హత్యను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితునికి వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూడాలని కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. ఇటు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఢిల్లీలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఢిల్లీ సిఎం, కేంద్ర హోంమంత్రితో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.