ఏపీలో ఇసుక కొరతపై నిలదీతలు కొనసాగుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను భవన నిర్మాణ కార్మికులు అడ్డుకున్నారు. సోమవారం నెల్లూరు టౌన్ లో పర్యటిస్తున్న మంత్రి అనిల్ వద్దకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతపై ఆయనను నిలదీశారు.
మంత్రి అనిల్ సావధానంగా వారి సమస్యలు విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అధిక వర్షాల వల్ల నదులు, వాగులున్నీ నీటితో నిండిపోయాయని అందుకే ఇసుక తవ్వకం నిలిచిపోయి కొరత ఏర్పడిందని మంత్రి భవన నిర్మాణ కార్మికులకు వివరించారు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇసుక దోపిడీని అరికట్టడానికి కొత్త పాలసీ తెస్తోందని.. తద్వారా ఇసుక పేదలు, మధ్యతరగతి వారికి ఉచితంగా అందుబాటులోకి వస్తుందని మంత్రి వారికి వివరించారు. అయితే ఇసుక కొరత వల్ల పనులు అన్నీ బంద్ అయిపోయి పస్తులుంటామని త్వరగా పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికుల మంత్రిని కోరారు.