న‌గ్నంగా భోజనం చేసేందుకు 4వేల మంది రెడీ!

Update: 2016-04-21 15:46 GMT
ఈ వార్తను చ‌దివి వెర్రి వేయి విధాలు అనుకోండి. అలా కాక‌పోతే ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా వ‌చ్చిన కొత్త రెస్టారెంట్ అనుకోండి. విష‌యం ఏంటంటే న‌గ్నంగా భోజ‌నం చేయ‌డం! అది కూడా సొంతంగా ఆస్వాదించేందుకు ప్రాధాన్యం. వీట‌న్నింటికి తోడు వ‌డ్డించే వారు కూడా అదే విధంగా ఉండ‌టం!! లండ‌న్‌లో రాబోతున్న ఈ హోట‌ల్‌ను స్థానిక ఔల్ కేఫ్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభించేందుకు రెడీ అయింది. ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌గానే వావ్ క్రేజీ...అంటూ ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు మేం వ‌చ్చేస్తాం అంటూ ప్ర‌తిపాద‌న పెట్టారు!!

కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు 'నేకెడ్ రెస్టారెంట్' (నగ్న రెస్టారెంట్‌) విశేషాలు ఏంటంటే... దుస్తులు తొలగించి అంటే నగ్నంగా భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదు కాబ‌ట్టి స్వేచ్ఛ‌గా లొట్ట‌లేసుకుంటూ తిన‌వ‌చ్చు. ఎవ‌రూ తొంగి చూసే అవ‌కాశం కూడా లేకుండా వెదురుతో పార్టిషన్ చేసి ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. వ‌డ్డించేవారి సంగ‌తి ఏంట‌నేదే క‌దా సందేహం... వారు కూడా ఈ రెస్టారెంట్‌ కు త‌గిన‌ట్లు కురుచ దుస్తులు ధరించి అల‌రిస్తారు.

ఇంత‌కీ విడిచిన దుస్తులు - ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకోవ‌డం ఎలా అనుకుంటున్నారా?  వాటిని భ‌ద్రంగా దాచుకునేందు ప్రత్యేక లాకర్ల వసతిని హోట‌లే స్వ‌యంగా కల్పిస్తోంది. ఇంత‌టితో ఈ క్రేజీ రెస్టారెంట్ విశేషాలు అయిపోలేదు. పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి స్పెష‌ల్ అట్రాక్ష‌న్స్‌. ఎక్క‌డైనా మొహ‌మాటం ఎదుర‌వుతుందేమోన‌ని ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంచార‌ట‌. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. వీట‌న్నింటితో పాటు 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ వేరుగా ఉంటుంది.
Tags:    

Similar News