కరోనా మహమ్మారి సోకినప్పుడు కాకుండా... వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఎన్నో దుష్ప్రభావాలు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
లెజెండరీ సింగర్స్ లతా మంగేష్కర్, బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడిన తర్వాత కోలుకుని... మళ్లీ ఆస్పత్రి పాలై చికిత్స పొందుతూ మరణించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా హఠాన్మరణం చెందారు. అయితే ఇందుకు కారణం పోస్ట్ కోవిడ్ ప్రభావాలేననే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి సోకినప్పుడు తొలుత శ్వాస వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ నాళం వంటి వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అంతేకాకుండా గుండె వంటి ప్రధాన అవయావాలపై కూడా దాడి చేస్తుంది.
గుండెకు ఆక్సిజన్ సరఫరా చేసే కణాలను దెబ్బతీస్తుంది. గుండె లోపలి కణాలను నాశనం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోవడం వల్ల గుండె ఎక్కువ ఒత్తిడికి గురవుతుందని గుర్తించినట్లు చెప్పారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు.
గుండె కణాలపై వైరస్ దాడి చేసి... సంకోచ వ్యాకోచాలపై ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. గుండె కొట్టుకోవడంలో మార్పులు జరుగుతాయని... పనితీరు మందగిస్తుందని అన్నారు. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అందుకే పోస్ట్ కోవిడ్ తో గుండెపోటు ప్రమాదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుకు ఇది కూడా ఒక కారణం అయి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
మానవ శరీరంలో వైరస్ గరిష్ఠంగా 220 రోజుల వరకు ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఇది 14 రోజులకే పరిమితం కాకుండా 70 రోజుల నుంచి 220 రోజుల వరకు యాక్టివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. శరీరంలోని ముఖ్య అవయవాలతో పాటు రోగనిరోధక శక్తి లో ఉండే టీ, బీ కణాలపై కూడా ప్రభావం చూపుతుందని గుర్తించినట్లు తెలిపారు.
వీటివల్ల గుండె పనితీరు మందగిస్తుందని.... గుండె వేగంలో మార్పులు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో హార్ట్ ఎటాక్ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.