మీ ముత్తాత.. తాత ఆస్తుల్ని ఇచ్చి ఉంటే ఏం చేస్తారు? వాటిని కాపాడటం.. మరింతగా పెంచటం లాంటివి చేస్తామని ఎవరైనా చెబుతారు. అంతేకానీ.. మా ముత్తాత.. తాతలు ఇచ్చిన ఆస్తుల నిర్వహణ పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎవరో ఒకరికి లీజుకు ఇచ్చేద్దాం? లేదేంటే అమ్మేద్దామన్న ఆలోచన చేస్తామా? ఈ రెండింటికి ఎవరూ ఎస్ అనే మాట చెప్పరు. ఎవరైనా సరే.. నో అంటే నో అనేస్తారు. కానీ.. ఘనత వహించిన మోడీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా ఆస్తుల్ని భారీ ఎత్తున లీజుకు.. అమ్మకానికి పెట్టేసిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు అంటే గడిచిన డెబ్భైఏళ్లలో ఆస్తుల్ని కాపాడుకుందాం.. వాటిని మరింత పెంచుదామనే ఆలోచన కంటే.. వీలైనంతవరకు వాటిని తగ్గిద్దామనే ప్రభుత్వాలే కొలువు తీరటం జాతి జనులు చేస్తున్న బ్యాడ్ లక్ ఏమో? గతానికి భిన్నంగా వర్తమానంలో మోడీ సర్కారు చెలరేగిపోతున్నారు. తాజాగా రూ.6లక్షల కోట్ల మొత్తాల్ని తెచ్చేందుకు ఆరు రంగాలకు చెందిన ప్రాజెక్టుల్ని లీజుకు ఇచ్చేయటం ద్వారా భారీ ఆదాయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
ఈ విషయం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇన్నాళ్లు కాపాడుకొచ్చిన ఆస్తుల్ని ఇలా ప్రైవేటు పరం చేయటమేమిటి? ప్రభుత్వాన్ని నడపటం అంటే.. ఇదేనా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివేళలోనే మరో విషయం బయటకు వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఉన్న అశోకా హోటళ్లను లీజుకు ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయ్యింది.
ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో మాంచి పేరున్న ఫైవ్ స్టార్ హోటల్ ‘ది అశోక్’ను ప్రైవేటు సంస్థకు లీజుకు ఇవ్వాలని డిసైడ్ చేశారు. దీంతో పాటు ఆ సమీపంలోనే ఉన్న హోటల్ సామ్రాట్ ను కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ది అశోక్ ను సబ్ లీజు పద్దతిలో.. సామ్రాట్.. భువనేశ్వర్ లోని కళింగ అశోక్.. జమ్ములోని జమ్ము అశోక్ లను రోజువారీ కార్యకలపాలకు ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు.
ఇలా మరిన్ని హోటళ్లను ప్రైవేటుకు అప్పజెప్పాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. 2022-25 మధ్య కాలంలో దీన్ని పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఇక.. ఆనందపూర్ సాహిబ్ హోటల్ యాజమాన్య హక్కుల్ని కూడా బదలాయించనున్నారు. ప్రధాన నగరాల్లో 125 ఎకరాల విస్తీర్ణంలో ఐటీడీసీకి హోటళ్లు ఉన్నాయి. ప్రస్తుతం దాని ఆధ్వర్యంలో నాలుగు హోటళ్లు.. మరో నాలుగు సంయుక్త భాగస్వామ్య హోటళ్లు.. ఏడురవాణా సంస్థలు.. నౌకాశ్రయాల్లో పద్నాలుగు డ్యూటీ ఫ్రీ షాపులు.. నాలుగు క్యాటరింగ్ కేంద్రాలు ఉన్నాయి. చూస్తుంటే.. మోడీ సర్కారు దేన్ని వదిలిపెట్టేదిగా లేదుగా? ఇంతకీ వీటన్నింటిని లీజు కోసం సొంతం చేసుకునే వారెవరో?