బ్రిటన్ దేశంలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ నుంచి రాకపోకలను ఇప్పటికే నిషేధించాయి. ఈ క్రమంలోనే భారతదేశానికి కూడా బ్రిటన్ నుంచి విమానం వచ్చిందని ఐదారుగురికి వైరస్ సోకిందన్న వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది.
ఇప్పటికే బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను భారత్ తాత్కాలికంగా నిషేధించింది. డిసెంబర్ 31వరకు ఈనిబంధనలు అమల్లో ఉంటాయి. తాజాగా బ్రిటన్ నుంచి దేశానికి వచ్చిన వారిలో కొత్త రకం వైరస్ లేదని.. ఈ కొత్త వైరస్ భారతదేశంలో ఇంకా బయటపడలేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8 వరకు యూకే నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులు.. జిల్లా నిఘా అధికారులను సంప్రదించాలని కేంద్రం సూచించింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని 14 రోజుల హిస్టరీ తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
కరోనా నెగిటివ్ వచ్చినా, కొన్ని రోజులు పాటు ఐసోలేషన్ లో ఉండాలని తెలిపింది. ఇక, పాజిటివ్ వచ్చిన ప్రయాణికుల శాంపిల్స్ ఎన్‌ఐవీ పుణెకు పంపాలని రాష్ట్రాలకు ఆదేశించింది.