ఆ సినిమా క్లైమాక్స్ 'స్వప్నలోక్' కాంప్లెక్స్ పైనే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్

Update: 2023-03-17 19:00 GMT
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని పేర్కొంటూ శివ సినిమా నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఆర్జీవీ.

శివ సినిమా క్లైమాక్స్ ను స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే చిత్రీకరించినట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు ఆర్జీవీ. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఈ ప్రమాదాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది అని పేర్కొన్నారు. శివ సినిమా ఆఖర్లో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్ స్వప్నలోక్ కాంప్లెక్స్ పైనే షూట్ చేసినట్లు తెలిపారు. ఓ నెటిజన్ ఆ సీన్ కు సంబంధించిన వీడియోను పోస్టు చేయగా.. ఆర్జీవీ దానిని రీట్వీట్ చేశారు.

ఈ ప్రమాదం తర్వాత హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ప్రమాద స్థలికి వెళ్లి సహాయకచర్యలను అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పర్యవేక్షించానని ట్వీట్ లో రాసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా మేయర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

అయితే దీనిపై స్పందించిన ఆర్జీవీ.. 'అక్కడికి నీ కుక్కలను కూడా తీసుకెళ్లావా..' అంటూ ట్వీట్ చేశాడు. వర్మ అలా స్పందించడంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మేయర్ ను ఇంక వదలవా ఆర్జీవీ అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మేయర్ కు గట్టిగానే బుద్ధి చెబుతున్నావ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఆర్జీవీపై తిట్ల దండకం అందుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శివారు అంబర్ పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై స్పందించిన మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగా అప్పటి నుండి ఆర్జీవీ మేయర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull View

Similar News