వైరల్: పాట పాడిన సీఎం..

Update: 2021-08-12 17:30 GMT
దేశంలోని బీజేపీ సీఎంలలో మోడీ తర్వాత సీనియర్ ఎవరయ్యా అంటే మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పేరే చెబుతారు. గత పదేళ్లుగా మధ్యప్రదేశ్ లో బీజేపీకి పట్టు పెరగడానికి శివరాజ్ సింగ్ కారణం అంటే అతిశయోక్తి కాదు. మధ్యప్రదేశ్ ప్రజలు శివరాజ్ సింగ్ ను ముద్దుగా 'మామ' అంటూ పిలుస్తుంటారు. రాజకీయాలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనే మామ సీఎం అంటూ పిలుస్తున్నారు.  ముగ్గురు అమ్మాయిలను దత్తత తీసుకొని వారికి పెళ్లిళ్లు కూడా జరిపించి అందరి మన్ననలు పొందారు..

ఇక ఇదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ల మధ్య చాలా ఏళ్లుగా విడదీయరాని బంధం ఉంది. వీరిద్దరినీ షోలేలో 'అమితాబ్-ధర్మేంధ్ర'లతో పోలుస్తుంటారు.  ఆ పిలుపునకు తగ్గట్టుగా తాజాగా ఇద్దరు మిత్రులు కలిసి షోలో పాట పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.

'యే దోస్తీ హమ్ నహీ చోడ్ దేంగే' అంటూ ఇద్దరు కీలక నేతలు చేతులు పట్టుకొని పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్  అసెంబ్లీ ప్రాంగణంలోనే జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ , కైలాస్ వర్గీయులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వీరిద్దరూ తమ స్నేహబంధానికి గుర్తుగా షోలే లోని ఈ ఎవర్ గ్రీన్ పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సీఎం, బీజేపీ కార్యదర్శి ఈ పాటను ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడడం వైరల్ అయ్యింది. మైక్ పట్టుకొని మరీ సీఎం శివరాజ్ ఈ పాటను పాడడంతో అభిమానులు ఉర్రూతలూగారు.

ఈ పాటను శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. అంతేకాదు.. ఈ పాటలో నటించిన అమితాబ్ బచ్చన, ధర్మేంద్రలను శివరాజ్ ట్యాగ్ చేశారు. ఇదిప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

https://twitter.com/ChouhanShivraj/status/1425504358058258433
Tags:    

Similar News