విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర? వైసీపీ సంచలన నిజాలు

Update: 2021-01-04 06:01 GMT
ఏపీలో ఆలయాలపై దాడులు కలవరపెడుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలకు టార్గెట్ గా మారుతున్నారు. రోజుకొకటి చొప్పున ఏపీ వ్యాప్తంగా విగ్రహాలు ధ్వంసం కావడం.. ప్రతిపక్షాలు రాజకీయం చేయడంతో ఏపీ అట్టుడికి పోతోంది.

ఈ క్రమంలోనే వైసీపీ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు క్రెడిట్ దగ్గకుండా చేయాలనే ప్రతిపక్షాలు ఈ కుట్ర చేస్తున్నాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో చర్చ జరగకుండా ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆందోళన మొదలైందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజల ఆశీర్వాదం సీఎం జగన్ కు ఉందని వారు గుర్తు చేస్తున్నారు.  

ఇప్పటివరకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి సంక్షేమ పథకంకు ముందు రోజో లేక మరుసటి రోజో ఏదో ఒకటి ఘటన వెలుగుచూస్తోందని.. ఇది ముమ్మాటికి కుట్రే అని వైసీపీ వాదిస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా వైసీపీ నేతలు చూపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

2019 నవంబర్ 14న సీఎంజగన్ ప్రతిష్టాత్మకంగా ‘మన బడి నాడు-నేడు’ అనే కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించాడని నేతలు గుర్తు చేశారు. అదే రోజు గుంటూరులోని దుర్గ ఆలయంపై దాడి విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిందని అన్నారు. క రైతుల మేలు కోరి ప్రభుత్వం ధరల స్థిరీకరణలో భాగంగా రూ.30వేల కోట్లను జనవరి 2020లో కేటాయించింది. మరుసటి రోజు అంటే జనవరి 21వ తేదీన పిఠాపురంలోని హనుమాన్ ఆలయంలో 23 విగ్రహాలు ధ్వంసమైయ్యాయని వైసీపీ ధ్వజమెత్తింది.

2020 ఫిబ్రవరి 11న రొంపిచర్ల వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహాలు ధ్వంసం కాగా.. అంతకుముందే రాజమండ్రిలో జగన్ దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారని నేతలు చెబుతున్నారు.సెప్టెంబర్ 7న అంగన్ వాడీలకు లబ్ధి చేకూర్చే పథకాన్ని జగన్ ప్రకటించనున్నారని అనగా.. అంతకుముందు రోజు అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథంకు దుండగులు నిప్పు పెట్టారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 11న జగన్ ‘వైఎస్ఆర్ ఆసరా పథకం’ను ప్రారంభించగా.. 13న విజయవాడన కనకదుర్గ ఆలయంలో వెండి సింహాలు మాయమయ్యాయని చెబుతున్నారు.

సెప్టెంబర్ 28వ తేదీన వైయస్సార్ జలకల పథకం ప్రారంభం అవడానికి మూడు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 25వ తేదీన నాయుడుపేటలోని తుమ్మూరులో ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసమై వార్తల్లో నిలిచింది. విద్యాకానుక అక్టోబర్ 8వ తేదీన ప్రారంభం కావడానికి ముందు మంత్రాలయంలోని నరసింహ ఆలయంపై దాడి జరిగిందనే విషయాన్ని వైసీపీ  ప్రజల దృష్టికి తీసుకొస్తోంది.

ఇక పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయనగరంలో జగన్ వస్తున్నారని ముందస్తు సమాచారంతో అదే జిల్లాలోని రామతీర్థంలో శ్రీరాముడి ఆలయంపై దాడి జరిగిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారని.. ఈ కుట్రకోణం బయటపడుతుందని వారంతా చెబుతున్నారు.
Tags:    

Similar News