మ‌న‌కు తెలియ‌కుండానే.. న‌గ్నంగా మార్చేసే `న్యూడిఫయింగ్‌` టూల్‌.. వివాదం ముదురుతోంది!!

Update: 2021-08-06 16:24 GMT
ప్ర‌పంచ దేశాల‌ను కుగ్రామంగా మార్చేసిన సాంకేతిక వ్య‌వ‌స్థ‌.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో భారీ స‌వాళ్ల‌నే ప్ర‌జ‌ల‌కు విసురుతోంది. ఇప్పుడు ఇలాంటి స‌వాలే ఒక‌టి.. అభివృద్ధి చెందిన దేశాల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. అదేంటంటే..  సరదా పేరుతో పుట్టుకొచ్చిన  'న్యూడీఫైయింగ్‌' టూల్‌.. ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో భారీ ఎత్తున వివాదానికి కార‌ణ‌మైంది. దీనిని వెంట‌నే ర‌ద్దు చేయాలంటూ.. బ్రిట‌న్ వంటి అత్యంత అబివృద్ది చెందిన దేశాల్లోనే డిమాండ్లు వినిపిస్తుండ‌డంతోపాటు.. చ‌ట్ట‌స‌భ‌ల వేదిక‌గా ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు.. ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. యూకే ఎంపీ మరియా మిల్లర్‌(57).. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ 'న్యూడీఫైయింగ్‌' మీద పార్లమెంట్‌ చర్చకు పట్టుబట్టడం ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ర్షించింది.

అస‌లు ఏమిటీ టూల్‌?
సాంకేతిక విప్ల‌వం ప్ర‌పంచాన్ని న‌డిపిస్తున్న ప్ర‌స్తుత యుగంలో అర‌చేతిలోనే అన్నీ చూసే అవ‌కాశం ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో దాదాపు ప్ర‌జానీకానికి ఉప‌యోగ‌ప‌డే సాంకేతిక‌తే.. వ‌స్తున్నా.. అప్పుడ‌ప్పుడు.. పంటికింద రాయిలా.. న్యూడిఫ‌యింగ్ టూల్స్ వంటివి కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. న్యూఢీఫైయింగ్‌ టూల్‌ అంటే.. నగ్నంగా మార్చేసే టూల్‌. ఈ టూల్‌ సాయంతో ఎదుటివారిని.. వారికి తెలియ‌కుండానే బట్టల్లేకుండా చేయొచ్చు. ఫొటోగానీ, వీడియోగానీ ఈ టూల్‌ ద్వారా అప్‌డేట్‌ చేస్తే..  స్కానింగ్‌ చేసుకుని నగ్నంగా మార్చేసి చూపిస్తుంది. `డీప్‌సుకెబే` అనే వెబ్‌సైట్ గ‌త‌ ఏడాది ఈ టూల్‌ను తీసుకువ‌చ్చింది.

ఎంత క్రేజ్ అంటే..
ఎదుటివారిని బ‌ట్ట‌ల్లేకుండా చూసి మురిసిపోవాల‌నుకునేవారికి, వేదించాల‌నుకునేవారికి ఈ టూల్ అద్భుతంగా తోచిందేమో.. వెంట‌నే..  కోట్ల మంది ఆ టూల్‌ను ఉపయోగించారు. ఒక్క జూన్‌ నెలలోనే యాభై లక్షల మంది ఈ సైట్‌ను సందర్శించారంటే.. ఈ టూల్‌ క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  'బట్టల వెనుక దాగున్న నగ్న సత్యాలను చూపిస్తాం.. మగవాళ్ల కలలను నిజం చేస్తాం' అంటూ ప్రమోషన్‌ చేసుకోవడంతో డీప్‌సుక్‌బే వెబ్‌సైట్‌కు విపరీతమైన పబ్లిసిటీ దక్కింది. పే అండ్‌ యూజ్ అయిన‌ప్ప‌టికీ.. ప్రపం చం వ్యాప్తంగా చాలామంది, మరికొందరు వీపీఎన్  సర్వీసుల ద్వారా ఈ టూల్‌ను ఉపయోగించుకుంటున్నారు.

అంతా చ‌ట్ట వ్య‌తిరేకంగానే.. అయినా..?
న్యూఢీఫైయింగ్‌ టూల్‌.. హేతుబద్ధమైంది కాదు. కానీ, అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మంచి క్రేజ్ ఉంది.  వివాదాలు-విమర్శలు-కేసులు ఏదేమైనా సరే.. న్యూడీఫైయింగ్‌ ఏఐ టూల్‌ సోర్స్‌ కోడ్‌ల అమ్మకం మాత్రం జోరుగా నడుస్తూనే ఉంది. ఏఐ టెక్నాలజీ ఏదైనా సరే.. లీగల్‌ అండ్‌ ఎథికల్‌గా ఉండాలనే నిబంధనను పాటించడం వల్లే చట్టాలూ కూడా ఇలాంటి టూల్స్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. అయితే ఏది ఏమైనా అశ్లీలతను.. అదీ అవతలివాళ్ల అనుమతి లేకుండా డిజిటల్‌గా ప్రోత్సహించడం తీవ్ర నేరంగా పరిగణించాలనేది ప్ర‌పంచ దేశాల డిమాండ్‌

వెలుగులోకి సంచ‌ల‌నాలు..
ఈ టూల్‌ను వినియోగించుకున్న‌వారిలో ఆ దేశం.. ఈ దేశం అనేతేడా లేకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది దీనిని వినియోగించుకున్నార‌ని.. స‌ర్వేలు చెబుతున్నాయి. దాదాపు అన్ని దేశాలకు చెందిన బాధితులు లక్షల్లో .. డీప్‌సుక్‌బే న్యూఢీఫైయింగ్‌ టూల్‌ బారిన పడ్డారనే విషయం వెలుగులోకి వచ్చింది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, ఒలింపిక్‌ అథ్లెట్లు కూడా బాధిత జాబితాలో ఉండడం విశేషం. అందుకే ఈ టూల్‌ వ్యవహార శైలిపై అందరిలో ఆగ్రవేశాలు రగులుతున్నాయి. వాస్తవానికి న్యూడీఫైయర్‌ టూల్స్‌ కొత్తేం కాదు. 'న్యూడ్‌ యువర్‌ ఫ్రెండ్‌' సపోర్టింగ్‌ ఫీచర్‌ పేరుతో కొన్ని ఫొటో, వీడియో యాప్‌ల ద్వారా ఇలాంటి ఆమధ్య బాగా వైరల్‌ అయ్యాయి.

ఒక‌సారి వెన‌క్కి త‌గ్గి.. మ‌ళ్లీ విజృంభించి..
డీప్‌న్యూడ్‌ అనే వెబ్‌సైట్‌ 2019లో ఈ టూల్‌ను తొలిసారిగా ఓన్‌ వెర్షన్‌తో లాంఛ్‌ చేసింది. ఆ టైంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో..  వెంటనే ఆ టెక్నాలజీని వెనక్కి తీసేసుకుంది. ఇక, ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీకి అడ్డు క‌ట్ట వేసే విష‌యంలో ప్రపంచంలో ఎక్కడా న్యాయపరమైన చర్యలకు  చట్టాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  దీంతో యూకేలో ప్రత్యేక బిల్లు కోసం పోరాడాలని చ‌ట్ట‌స‌భ స‌భ్యురాలు మరియా మిల్లర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆమెకు మ‌హిళా చ‌ట్ట స‌భ స‌భ్యులు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ క్ర‌మంలో దీనిపై బ్రిటన్ క‌నుక ఒక చ‌ట్టం చేయ‌గ‌లిగితే.. ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో  చూడాలి.
Tags:    

Similar News