గాలి ద్వారా కరోనా వ్యాపించదు ... మరోసారి స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్‌ వో !

Update: 2020-03-30 15:00 GMT
కరోనా వైరస్ .. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి .. ఆ తరువాత ఒక్కొక్క దేశం విస్తరిస్తూ ..ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా వైరస్ 7 లక్షల మందికి సోకగా ..33 వేలమంది చనిపోయారు. ఇక మన దేశంలోనూ ఈ మహమ్మరి వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు ..1000 మంది ఈ కరోనా భారిన పడ్డారు. అలాగే 29 మంది మృతిచెందారు.

కరోనా వ్యాధి గాలి ద్వారా వ్యాపించదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ వో) స్పష్టం చేసింది. గాలి ద్వారా ఈ కరోనా వైరస్  చాలా సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందంటూ ఇంటర్నెట్‌ మాధ్యమంగా వదంతులు పుట్టుకొస్తుండటంతో డబ్ల్యూహెచ్‌ వో ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్ఫెక్షన్‌ కలిగిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినప్పుడు, అతడు తాకిన వస్తువులు - ప్రదేశాలను తాకినప్పుడు మాత్రమే కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా బాధితుడు దగ్గినప్పుడు - తుమ్మినప్పుడు వెలువడే నీటితుంపరల ద్వారానూ వైరస్‌ వ్యాపిస్తుందని పేర్కొంది. వ్యక్తికి - వ్యక్తికి మధ్య కనీసం 1.5 మీటర్ల సామాజిక దూరం పాటించడం మంచిదని తెలిపింది.
Tags:    

Similar News