దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నప్పటికీ.. ఇంకా నిత్యం 2 లక్షలపైనే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్య చూస్తే.. 2 కోట్ల 65 లక్షల 30 వేలు పైచిలుకు కేసులు రికార్డెడ్ గా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కొవిడ్ తీవ్రతపై సుదీర్ఘ సర్వే కొనసాగించింది ఐసీఎమ్ఆర్. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ఈ సర్వే జరిగింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఈ సర్వే చేపట్టింది. ఈ రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో సర్వే కొనసాగించిన ఐసీఎమ్ఆర్ ప్రతినిధులు.. ఒక వ్యక్తి కరోనా బారిన పడితే.. సగటున మరో 27 మందికి వైరస్ సోకుతున్నట్టు గుర్తించారట.
ఈ లెక్కన ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 24.1 శాతం మందికి కరోనా సోకిందని నిర్ధారించింది ఐసీఎమ్ఆర్. కొవిడ్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తున్నందున దీని అడ్డుకట్టకు ప్రజలు సహకరించాలని సూచించింది. ఖచ్చితంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది. అంతేకాకుండా.. శానిటైజేషన్ ప్రక్రియ కూడా తప్పకుండా కొనసాగించాలని కోరుతోంది.