చనిపోయిన మహిళ తిరిగొచ్చింది

Update: 2021-04-25 12:30 GMT
ఉత్తరప్రదేశ్ లో చనిపోయిన మహిళ బతికివచ్చింది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. జాన్సీ మెడికల్ కాలేజీ అధికారులు కోవిడ్ కారణంగా 65 ఏళ్ల మరణించినట్లు తెలిపారు.. అయితే అదే మహిళ ఒక రోజు తరువాత సజీవంగా బయటకు రావడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. కోవిడ్ కారణంగా మహిళ రాజ్ కుమారి గుప్తా (65) ను శుక్రవారం మరణించినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు. రాజ్‌కుమారిని ఏప్రిల్ 23న ఆసుపత్రిలో చేర్పించారు. అదే రోజున 'మరణించారని.. గొంతు నొప్పి, జ్వరం , దగ్గుతో శ్వాస సమస్య తలెత్తి కన్నుమూసిందని అధికారుు పేర్కొన్నారు.

తరువాత ఒక వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. అందులో రాజ్ కుమారి కోలుకున్నాదని.. చాలా ఫిట్ గా ఉందని తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. చనిపోయిందని వైద్యులు ప్రకటించిన మహిళ ఎలా బయటకు వచ్చిందని స్తానికులు ప్రశ్నించారు.

జాన్సీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర సింగ్ సెంగర్ మాట్లాడుతూ గురువారం అర్థరాత్రి కోవిడ్ తో ఇలాంటి పేరున్న మహిళ మరణించడంతో ఇది తప్పుగా గుర్తించబడిందని.. పొరపాటున రాజ్ కుమారిని చనిపోయిందని రిపోర్టు ఇచ్చామని ఆయన వివరణ ఇచ్చారు.

అయితే మరణించిన మహిళా బంధువులు ఆస్పత్రిలో ఆందోళన నిర్వహించారు. "మరణించిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలోని ఐసియూ వార్డులోకి ప్రవేశించి నిలదీశారు. బతికున్న మహిళను చనిపోయిందని ఎలా చెప్పారని ఆందోళన చేశారు. దీనిపై పోలీస్ కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వైద్య సిబ్బందిని పోలీసులు విచారించారు.

అదే ఆస్పత్రిలో మరణించిన వారిలో 69, 67, 45, సంవత్సరాల వయస్సు గల ముగ్గురు మహిళలున్నారు. 56, 59, 65 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పురుషులు ఉన్నారు. అందుకే పొరపాటు జరిగిందని తెలిపారు.




Tags:    

Similar News