పద్నాలుగు నెలలవుతోంది.. కేవలం సైనిక చర్య అన్నాడు. పౌరులు తమ లక్ష్యం కాదన్నాడు.. వాస్తవం మాత్రం వేరే.. రైల్వే స్టేషన్, ప్రజలుంటున్న అపార్ట్ మెంట్లు, బడి, గుడి, ఆస్పత్రి ఇలా దేన్నీ వదల్లేదు. వేలాది ప్రాణాలు.. లక్షల కోట్ల నష్టం.. మౌలిక వసతులు కోలుకోలేనంతగా ధ్వంసం.. ఎవరూ ఊహించనంతటి ఉత్పాతం.. ఇదీ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఫలితం.
ఆ అత్యాచారాలు.. ఆ భీకర దాడులు
2022 ఫిబ్రవరి 24న బెలారస్, తమ భూభాగం, ఆక్రమించిన క్రిమియా నుంచి ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టింది రష్యా. తొలినాళ్లలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చుట్టుముటింది. కానీ, ఉక్రెయిన్ నుంచి ఊహించని
ప్రతిఘటనకు భయపడో, తూర్పు ప్రాంతమైన డాన్ బాస్ ను చేజిక్కించుకోవాలన్న లక్ష్యమో ఆ ప్రాంతం నుంచి వైదొలగింది. కానీ, ఈ వ్యవధిలోనే దారుణాలకు పాల్పడింది. సాధారణ ప్రజలను కాల్చివేయడం, మహిళలు, యువతుల పై అత్యాచారాలకు పాల్పడడం వంటివి చేసింది. ముఖ్యంగా కీవ్ సమీపంలోని బుచాలో ఇలాంటి దారుణాలు వెలుగుచూశాయి. అక్కడ సామూహిక మారణకాండ జరగ్గా.. వందలాది శవాలను ఒకేచోట పాతిపెట్టిన వైనం బయటపడింది. ఇక క్రమాటోర్క్స్ వంటి చోట్ల కిక్కిరిసిన రైల్వే స్టేషన్ పై క్షిపణి దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సామూహిక మారణకాండలు ఎన్నో..?
ప్రజల కోసం వెళ్లి ప్రాణాలు బలి
ఉక్రెయిన్ యుద్ధంలో తొలినాళ్లలోనే పురుషులను దేశం బయటకు వెళ్లకుండా చేశారు. యుద్ధంలో పాల్గొనాల్సిన అవసరాల రీత్యా ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాల భారీఎత్తున ఆయుధ సాయం లభిస్తుండడంతో ఆ దేశం ఇంకా పోరాడగలుగుతోంది. అయితే, ఇప్పటికే ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి నెలాఖరు వరకు అంచనా ప్రకారం ఆ దేశ పునర్నిర్మాణానికి రూ.40 లక్షల కోట్లు అవసరం
అవుతాయి. ఇది దాదాపు భారత దేశ బడ్జెట్ అంత. కాగా, రష్యా దండయాత్రలో ఉక్రెయిన్ క్రీడాకారులు పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోయారు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు సామాన్యులు, సైనికులతో పాటు వీరు యుద్ధ రంగంలోకి దిగారు. తుపాకీ చేత పట్టారు. మాస్కో బలగాలకు దీటుగా పోరాడారు.
బలైనవారు 200 పైనే
ఉక్రెయిన్ లో రష్యా దాడులు భీకరంగా సాగాయి. అవి ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. ఆ ప్రాంతంలో ఏమీ మిగలనంత స్థాయిలో. ఇలా యుద్ధంలో పాల్గొన్న క్రీడాకారుల్లో 262 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇంతటి మారణహోమానికి కారణమైన రష్యాను ఏ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా బహిష్కరించాలని కోరింది. 363 క్రీడా మైదానాలు దెబ్బతిన్నాయని వివరించింది. ఇంత దారుణాలకు పాల్పడినప్పటికీ రష్యా, దానికి వంతపాడుతున్న
బెలారస్ కు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అవకాశం ఇవ్వడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2024 ఒలింపిక్ క్వాలిఫయింట్ ఈవెంట్లలో రష్యాతో తలపడేది లేదని స్పష్టం చేసింది.
కొసమెరుపు: ఉక్రెయిన్ మీద యుద్ధం కారణంగా రష్యా ను 2022 ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నీ నుంచి బహిష్కరించారు. మరోవైపు యుద్ధంలో ఇంత తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఉక్రెయిన్ 2030 ఫిఫా ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణకు సిద్ధమని, అందుకోసం బిడ్ వేస్తానని ఆత్మస్థైర్యంతో చెబుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.