పాలగ్లాసు పట్టుకొని వెళ్లిన వధువుకు షాకిచ్చిన వరుడు

Update: 2021-06-10 06:30 GMT
తప్పుడు మాటలు చెప్పి పెళ్లి చేసి అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసేటోళ్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వధువుకు జరిగిన అన్యాయం తెలిస్తే అయ్యో అనకుండా ఉండలేరు. అదే సమయంలో వరుడు తరఫు వారు వ్యవహరించిన తీరును తప్పు పట్టటమే కాదు.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా చెప్పటం ఖాయం. ఇంతకూ ఏం జరిగిందంటే..

తెనాలికి సమీపంలోని 20 ఏళ్ల యువతికి.. విజయవాడ ఆటోనగర్ కు చెందిన ఒక యువకుడికి ఏప్రిల్ 4న పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు మాట్లాడుకునేటప్పుడు తమ కొడుకు ఉన్నత చదువుల కోసం త్వరలో కెనడాకు వెళుతున్నాడని.. అక్కడే జాబ్ చేసుకుంటాడని.. భార్యను తీసుకెళతాడని చెప్పారు. భారీగా కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. తొలి రాత్రిన పాలగ్లాసు పట్టుకొని గదిలోకి వచ్చిన వధువుకు షాకింగ్ నిజాన్ని చెప్పాడు వరుడు.

తాను సంసారానికి పనికి రానని.. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని వేడుకోవటంతోపాటు.. తాను నపంశుకుడ్ని అని చెప్పుకున్నాడు. దీంతో షాక్ తిన్న వధువు.. తర్వాతి రోజు నిర్వహిస్తున్న రిసెప్షన్ వేళ..తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో.. పెళ్లికుమార్తెను వారి తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్లిపోయారు. అనంతరంఇరు వర్గాల మధ్య పంచాయితీ మొదలైంది.

చేసిన తప్పునకు బాధ పడకుండా.. తామురిసెప్షన్ కోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టాం కాబట్టి ఆ మొత్తాన్ని అమ్మాయి తరఫు వారు భరించాలని డిమాండ్ చేయటంతో వారు అవాక్కు అయ్చే పరిస్థితి. తమకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారాన్ని భారీగా అడగాల్సింది.. రివర్సులో తమను పరిహారం ఇవ్వాలన్నట్లుగా మాట్లాడటం వారిని కలిచివేసింది. మాట్లాడుకోవటానికి వచ్చినట్లు చెప్పి వధువు ఇంట్లోనే.. వారిపై దాడి చేసిన వరుడి కుటుంబీకుల వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. పాలగ్లాసుతో వచ్చిన వధువుకు నిజాన్ని చెప్పే కంటే..ఆ ఏడుపు ఏదో తమ తల్లిదండ్రులకు వరుడు చెప్పి ఉంటే.. అసలీ రచ్చే ఉండేది కాదు కదా?







Tags:    

Similar News