తమిళనాడులో దారణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ డాక్టర్. పదునైన కత్తితో గొంతు కోసి కిందపడేసి ఆమెపై కారు పోనిచ్చి మరీ హతమార్చాడు. ఈ ఘటనలో ఆ భార్య అక్కడికక్కడే మరణించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ ను విధించింది.
కీర్తన అనే 28 సంవత్సరాల అమ్మాయి తమిళనాడులోని కాంచీపురంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మేనేజర్ గా పనిచేస్తోంది. ఆరేళ్ల కిందట ఆమెకు డాక్టర్ గోకుల్ కుమార్ తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. కోయంబత్తూరుకు చెందిన గోకుల్ కుమార్-కీర్తనలు మధురాంతకంలో స్థిరపడ్డారు. చెన్నై సమీపంలోని పొత్తేరిలో గోకుల్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు.
అయితే కరోనా లాక్ డౌన్ అనంతరం అతడు ఉద్యోగాన్ని మానివేశఆడు. ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆరునెలలుగా వేర్వేరుగా నివసిస్తున్నారు. మూడు నెలల కిందట కీర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు ఇవ్వడానికి గోకుల్ అంగీకరించలేదు. కీర్తన పట్టుబట్టడంతో శుక్రవారం కీర్తన ఇంటికెళ్లి గోకుల్ తో ఘర్షణ పడ్డాడు. గొడవ చేశాడు. అడ్డొచ్చిన మామ మురహరిపై గోకుల్ దాడి చేశాడు. కీర్తనను పొడిచాడు. వీధుల్లోకి పరిగెత్తిన ఆమెను కారుతో తొక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఆమె చనిపోయిందని ప్రకటించారు. గోకుల్ కారులో పారిపోయాడు.