విశ్వాసం అన్న మాటకు శునకానికి మించిన జీవి ప్రపంచంలో కనిపించదు. ఈ విషయంలో మనిషి సైతం కుక్క తర్వాతే. దానితో పోటీ పడటం సాధ్యం కానిది. తాజాగా బయటకు వచ్చిన ఒక ఉదంతం గురించి విన్న వారంతా అయ్యో అనుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎమోషన్ అయి.. పాపం అంటూ ఆ కుక్క పరిస్థితికి జాలి పడుతున్నారు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. అందరికి ఈ కుక్క గురించి తెలిసి.. అయ్యో అనకుండా ఉండలేకపోతున్నారు.
తమిళనాడులోని సేలంకు చెందిన మోహన్ కుమార మంగళం అనారోగ్యం బారిన పడ్డాడు. అతడికి గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు. అతను ఒక కుక్కను పెంచేవాడు. మూడు నెలల క్రితం అతన్ని అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. దీంతో.. అతనితో పాటు కుక్క కూడా వచ్చింది. ఎమర్జెన్సీ వార్డులో అతన్ని చేర్చి చికిత్స చేయగా.. అక్కడే ఆ కుక్క ఉంది.
అయితే.. అత్యవసర వైద్య విభాగంలో చికిత్స చేసినప్పటికి ఫలితం లేకపోవటం.. మోహన్ కుమార మరణించటం జరిగాయి. డెడ్ బాడీని అతని బంధువులకు అప్పజెప్పారు. అయితే.. ఈ పెంపుడు కుక్కకు మాత్రం తన యజమాని మరణించిన విషయం తెలీదు. దీంతో.. యజమాని మరణించిన మూడు నెలల తర్వాత కూడా ఎమర్జెన్సీ వార్డు బయటే ఉండి.. ఎప్పుడు తన యజమాని బయటకు వస్తాడా?
అంటూ ఆశగా ఎదురుచూస్తోంది. దీంతో దాని తీరుకు జాలి పడిన ఆసుపత్రి సిబ్బంది దానికి ఆహారం పెడుతూ.. బయటకుపంపుతున్నా.. మళ్లీ కాసేపటికి వచ్చి అక్కడే ఉండిపోవటం ఆసుపత్రి సిబ్బంది సైతం అయ్యో అనుకునేలా చేస్తోంది. "పాపం మూగజీవి. దాని విశ్వాసం ముందు మనిషి ఎంత? ఎన్నిసార్లు బయటకు పంపినా.. మళ్లీ అక్కడకే వచ్చేస్తుంది. అందుకే దాన్ని ఈ మధ్యన ఏమీ అనటం లేదు" అని ఆసుపత్రి సిబ్బంది చెప్పటం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.