ఈ మద్యే ట్విట్టర్ సెట్టింగ్స్ లో “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్లు చూపిస్తుండటంతో… ట్విట్టర్ కు భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సున్నితమైన అంశాలను గౌరవించాలని ట్విట్టర్ కు తేల్చిచెప్పింది. ట్విట్టర్ వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రప్రభుత్వం…ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీకి లేఖ రాయడంతో , భారత్ కి ట్విట్టర్ క్షమాపణలు చెప్పింది. లేహ్ అంటే అదాక్ హెడ్ క్వాటర్స్ అని అంతేకాకుండా జమ్ము-కాశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగాలేనని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత భూభాగాలను చైనా భూభాగాలుగా చూపించడం సరికాదని ట్విటర్ సీఈఓకు భారత పార్లమెంటు లేఖ ద్వారా హెచ్చరించింది. దీనితో ఇండియా విలువలను మేము గౌరవిస్తామనీ, ఆ దేశ విధానాలను సరిచూసుకుంటామనీ ఆయన స్పష్టం చేశారు.
ఇక తాజాగా సౌదీ కూడా అదే తరహా తప్పు చేసింది. తాజాగా జీ 20 దేశాల ప్రత్యేక సమావేశాల సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక నోటు పై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం యొక్క బాహ్య ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా చిత్రీకరించడం పట్ల నిరసన వ్యక్తం చేసినట్టు భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది. రియాద్‌లో వచ్చే నెల 21,22 తేదీల్లో జరుగనున్న జీ 20 దేశాల ప్రత్యేక శిఖరాగ్ర సమావేశాలకు గుర్తుగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యేక కరెన్సీ నోటును తీసుకువచ్చింది. ఈ నోటును సౌదీ అరేబియా ద్రవ్య అథారిటీ ఈనెల 24 న విడుదల చేసింది.
20 రియాల్స్ విలువచేసే నోటుపై సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫొటో ఉండగా.. రెండవ వైపున ప్రపంచపటం.. ఇందులో జీ-20 దేశాలను వేర్వేరు రంగుల్లో చూపించారు. కశ్మీర్ కాకుండా గిల్గిట్, బాల్టిస్తాన్లను పాకిస్తాన్ లో భాగంగా వర్ణించలేదు. జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించాలనుకుంటున్నాం అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు. సౌదీ అరేబియా అధికారిక, చట్టపరమైన నోటుపై భారతదేశం యొక్క బాహ్య ప్రాదేశిక సరిహద్దులను పూర్తిగా తప్పుగా చూపించారు. అందుకు న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబారి ద్వారా తీవ్రమైన ఆందోళనను తెలియజేసాం. అత్యవసరంగా తీసుకున్నందుకు సౌదీ వైపు దిద్దుబాటు చర్యలు కోరార అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.