గుడ్ న్యూస్: కరోనా ఒక్కసారి వస్తే మళ్లీ రాదు

Update: 2020-07-24 09:30 GMT
ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా మీకు ఒకసారి వచ్చిందా? బతుకుజీవుడా అంటూ బయటపడ్డారా? ఇక మీకు మళ్లీ రాదని శాస్త్రవేత్తలు తేల్చారు. అవును కరోనా వచ్చిన రోగిలో యాంటీ బాడీలు.. టీసెల్స్ ఆ రోగనిరోధక శక్తిని కలిగి ఉండడంతో కరోనా ముప్పు ఒకసారికి మించి రాదని కనిపెట్టారు.

రెండోసారి కరోనా సోకే చాన్స్ తక్కువని.. కానీ కొన్నిసార్లు మొదట సోకిన వైరసే శరీరంలో ఎక్కడైనా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గగానే అది శరీరంపై ప్రభావం చూపించవచ్చని అంటున్నారు.

ఒకసారి కరోనా వచ్చిన వారిలో యాంటిబాడీసే కాకుండా.. టీసెల్స్ కూడా వైరస్ పై పోరాటం చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇలా జనాభాలో ఎక్కువ శాతం సోకినా కూడా వైరస్ ను ఎదుర్కొనే శక్తి వారికి వచ్చేస్తుందని.. భవిష్యత్ లో బాధించదని తేలింది.
Tags:    

Similar News