విశాఖపట్నం మన్యంలో పీపీఈ కిట్ తో రోడ్డు పైకి వచ్చిన ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పీపీఈ కిట్ ధరించి ఆయన రోడ్డుపైకి రావడంతో ఆ వ్యక్తిని చూసిన జనాలు భయంలో పరుగులు తీశారు. కరోనా వైరస్ సోకిన రోగి ఏమోనని ఆందోళన చెందారు. పాడేరు రహదారిపై శనివారం ఉదయం ఓ వ్యక్తి రోడ్డుపై పీపీఈ కిట్ ధరించి కనిపించాడు. కనిపించిన వారందరిని పలకరిస్తూ దగ్గరకు వెళ్లాడానికి ప్రయత్నించాడు. దీంతో ఆయన్ను కోవిడ్ రోగిగా భావించి ప్రజలు దూరంగా పరుగులు తీశారు.
ఈ విషయం తెలిసిన వైద్య అధికారులు తమ ఆస్పత్రిలో ఉన్న రోగులను సరి చూసుకున్నారు. అందరూ ఉండడంతో ఆ వ్యక్తి రోగి కాదని గుర్తించారు. అయితే ఆయన వ్యర్థాల్లో పడేసిన పీపీఈ కిట్‌ను ధరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు పాడేరు మెయిన్ రోడ్డుపై ఈ అపరిచితుడు సంచరించడంతో ప్రజలకు కొంత ఆందోళనకు గురయ్యారు. చివరకు అతడిని దూరాన ఆపి ప్రశ్నించగా.. చలి తీవ్రత తట్టుకోలేక పీపీఈ కిట్ వేసుకున్నానని అన్నాడు. దీంతో స్థానికులు మొదట షాక్‌కి గురయ్యారు, తరువాత ఊపిరిపీల్చుకున్నారు. ఆ తరువాత పీపీఈ కిట్ విప్పించి అక్కడి నుంచి పంపేశారు