పొంచి ఉన్న మండ‌లి ముప్పు.. కేంద్రం నిర్ణ‌యంపై ఉత్కంఠ‌..!

Update: 2021-10-04 12:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న శాస‌న మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యం.. మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌స్తోంది. వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో దీనిపై నిర్ణ‌యం తీసుకునేదిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చిస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నా యి. దీంతో మండ‌లి విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. వాస్త‌వానికి మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని ఆదిలో జ‌గ‌న్ స‌హా పార్టీ నేత‌లు కోరుకున్నా.. రానురాను ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మండ‌లి లేక పోతే.. వైసీపీకి తీవ్ర న‌ష్టం వాటిల్లే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏడాదిన్న‌ర కింద‌ట‌.. జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో మూడు రాజ‌ధానుల బిల్లు స‌హా సీఆర్డీఏ ర‌ద్దును ప్ర‌తిపాదిస్తూ.. జ‌గ‌న్ బిల్లులు ప్ర‌వేశ పెట్టారు.

అయితే.. వీటికి అసెంబ్లీలో ఆమోదం పొందినా.. శాస‌న మండ‌లిలో టీడీపీ బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇక్క‌డ ఆమోదం పొంద‌లేదు. పైగా టీడీపీ నుంచి తీవ్ర మైన ఎదురు దాడి ఎదురైంది. ఈ ప‌రిణామాల‌తో తీవ్రంగా క‌లత చెందిన జ‌గన్ ఏకంగా... మండ‌లి ర‌ద్దును ప్ర‌తిపాదించారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి హ‌డావుడిగా కేంద్రానికి పంపారు. అయితే.. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై నిర్ణ‌యం తీసుకోలేదు. మండ‌లిని ఏర్పాటు చేయాల‌ని అన్నా.. తీసేయాల‌ని అన్నా.. ఖ‌చ్చితంగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాలి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం మండ‌లి కోరుతూ.. ప్ర‌తిపాద‌న పంపింది. దీనిపైనా.. కేంద్రం ఏమీ తేల్చ‌లేదు.

ఇప్ప‌టికే ఈ విష‌యంపై తాము సీరియ‌స్‌గా ఉన్నామ‌ని.. ఏపీ పంపిన ప్ర‌తిపాద‌న‌ను వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో చ‌ర్చించేందుకు రెడీ అవుతున్నామ‌ని.. ఇటీవ‌ల ముగిసిన పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్రం వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా దీనిపై మ‌రోసారి క‌స‌రత్తు ప్రారంభించిన కేంద్ర హోం శాఖ‌.. ర‌ద్దు విష‌యంపై నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు ఢిల్లీవ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో చ‌ర్చించ‌నున్నారు. ఇదే జ‌రిగితే.. ఏపీ టీడీపీ ఎంపీలు.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ స‌హా.. కొంద‌రు.. ర‌ద్దుకు ఓకే చెప్ప‌నున్నారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం ఇరుకున ప‌డే ప్ర‌మాదం క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో యువ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న జ‌గ‌న్‌.. పార్టీలోని చాలా మంది సీనియ‌ర్ల‌ను సంతృప్తి ప‌రిచేందుకు మండలికి పంపుతున్నారు. మ‌రో రెండు మాసాల్లో మ‌రిన్ని సీట్లు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో సీనియ‌ర్ల‌కు అవ‌కాశం ల‌భించ‌నుంది. త‌ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు మార్గం సుగ‌మం కానుంది. ఈ త‌రుణంలో.. మండ‌లి క‌నుక ర‌ద్ద‌యితే.. వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని.. అప్పుడు.. యువ‌త‌కు, సీనియ‌ర్ల‌కు కూడా చోటు క‌ల్పించేందుకు ప్ర‌యాస ప‌డాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ గండం నుంచి వైసీపీ ఎలా బ‌య‌ట ప‌డుతుందో చూడాలి.
Tags:    

Similar News