గడిచిన కొద్దిరోజులుగా భారత్ కు కాస్త పొరుగున ఉండే మయన్మార్ లో ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలటరీ.. దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రభుత్వాన్ని కాలరాచి.. ప్రజలపై పెద్ద ఎత్తున ఆంక్షల్ని విధించి.. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోషల్ మీడియాపై ఇప్పటికే ఆంక్షలు విధించిన సైనిక పాలకలు.. తాజాగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం మయన్మార్ లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లుగా ఆ దేశంలో నెట్ సేవల్ని పర్యవేక్షించే నెట్ బ్లాక్స్ వెల్లడించింది. దీనికి కారణం సోషల్ మీడియాలో సైనిక పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోస్టుల్ని పెట్టటమే. దీంతో.. ఈ వ్యతిరేకతను ప్రజలు షేర్ చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఈ కొత్త ఆంక్షల కత్తిని ఝుళిపించారు.
మరోవైపు మయన్మార్ దేశ ప్రజల భద్రతను ప్రాతిపదికగా తీసుకున్నట్లుగా చెబుతున్న సైనిక పాలకులు.. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్.. ట్విటర్.. ఇన్ స్టాను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ చర్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ అవకతవకలకు పాల్పడిందంటూ సైన్యం ఆరోపిస్తూ.. అధికారాన్ని తమ హస్తగతం చేసుకుంది. దేశ మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఈ తీరును దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.