కేసీఆర్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన తాజా సర్వే రిపోర్టు

Update: 2023-04-22 10:14 GMT
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ.. ఇప్పటికి తొమ్మిదేళ్ల (దగ్గర దగ్గర)పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. సాధారణంగా ఇంత దీర్ఘకాలం పవర్ లో ఉన్నప్పుడు.. ప్రభుత్వం మీద వ్యతిరేకత సర్వసాధారణం. అయితే.. అలాంటిదేమీ ప్రధాని నరేంద్ర మోడీ మీద లేదన్న విషయం తాజాగా నిర్వహించిన సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మోడీ సర్కారుకు దింపేయాలని విపక్షాలు కలిసి కట్టుగా పోరాడేందుకు వీలుగా ప్లానింగ్ జరుగుతున్న వేళ.. వారి ప్రయత్నాలకు బ్రేకులు పడేలా తాజా సర్వే రిపోర్టు వెల్లడైంది.

ప్రముఖ మీడియా సంస్థలైన టైమ్స్ నౌ - నవ భారత్ సంస్థలు తాజాగా సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా అడిగిన కీలక ప్రశ్న ఏమంటే.. ఎన్నికలకు ముందే విపక్షాలు ఒక కూటమిని ఏర్పాటు చేయగలవా? మోడీకి ధీటైన పోటీని ఇవ్వగలవా? అన్న ప్రశ్నల్ని సందించారు.

దీనికి 49 శాతం మంది కాదు అని సమాధానం ఇవ్వగా.. 37 శాతం మంది మాత్రమే గట్టి పోటీ ఇస్తారని చెప్పటం గమనార్హం. మరో 15 మంది మాత్రం తామేమీ చెప్పలేమని పేర్కొన్నారు.

మరింత షాకింగ్ విషయం ఏమంటే.. ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమి కట్టే చాన్సే లేదని 26 శాతం మంది చెబితే.. ఎన్నికల తర్వాత ఏమైనా కలిసే వీలుందన్న వాదనను మరో 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 17 మంది తాము ఎలాంటి సమాధానం చెప్పలేమని పేర్కొన్నారు. ఇక.. ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో బాగా నలిగిన మోడీ ఇంటి పేరును రాహుల్ నిందించారన్న కారణంగా కోర్టు ఆయనపై చర్యలు తీసుకున్న ఉదంతంపైనా ప్రశ్నలు సంధించారు.

మోడీ ఇంటి పేరు మీద అనర్హత వేటు పడిన ఉదంతంతో బాధితుడిగా నిలిచిన రాహుల్ కు ఈ వ్యవహారం రాజకీయంగా లాభాన్ని చేకూరుస్తుందా? అని సర్వేలో అడిగితే.. 39 మంది నో చెప్పగా.. సానుభూతి వస్తుందని కేవలం 23 శాతం మంది మాత్రమే సమాధానం చెప్పారు.

మరో 11 మంది మాత్రం జాతీయ రాజకీయాల్లో అనర్హత ఎలాంటి ప్రభావాన్ని చూపలేదన్న విషయాన్ని తేల్చిచెప్పారు. ఏతావాతా తేలిందేమంటే.. జాతీయస్థాయిలో మోడీకి ఉన్న ఇమేజ్ ఏమిటన్నది తాజా సర్వే స్పష్టం చేసిందని చెప్పాలి.

Similar News