ప్రస్తుతం దుబాయ్ లో ఒక భవనం అమ్మకం ఆన్ లైన్ వేదికగా హాట్ టాపిక్ గా మారింది. కారణం... అద్భుతమైన భవనం ప్రస్తుతం దుబాయ్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది విలాసవంతమైన ఆస్తులను ఎక్కువగా కోరుకునే నగరంలో అత్యంత ఖరీదైన ఇల్లుగా మారింది. అయితే ఈ ప్యాలెస్ ప్రత్యేకతలు ఏమిటి, ధర ఎంత అంటారా? పదండి ముందుకు వెళ్దాం…!
దుబాయ్ లోని ఎమిరేట్స్ హిల్స్ పరిసరాల్లో ఉన్న ఈ భవనం 60,000 చదరపు అడుగుల ఇండోర్ స్థలంలో విస్తరించి ఉంది. అయితే ఇందులో ఐదు బెడ్ రూమ్ లు మాత్రమే ఉండటం గమనార్హం. కాకపొతే ప్రైమరీ బెడ్ రూమ్ మాత్రమే 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటం గమనించాలి. అంటే ఈ ఒక్క బెడ్ రూం స్థలంలోనే చాలా ఇళ్లు కట్టెయ్యొచ్చన్నమాట.
ఈ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డైనింగ్ కి, ఎంటర్ టైన్ మెంట్ కి అంకితం చేయబడింది. వీటితో పాటు 15-కార్ల గ్యారేజ్, ఇండోర్ - అవుట్ డోర్ స్విమ్మింగ్ ఫూల్స్ తో పాటు భారీ అక్వేరియం ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. వీటితోపాటు ప్రత్యేకంగా ఒక సబ్ స్టేషన్ కూడా ఉంది.
గోల్ఫ్ కోర్స్ కు ఎదురుగా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఈ భవనం ఉంది. "మార్బుల్ ప్యాలెస్" గా పిలువబడే ఈ ప్యాలెస్ ను 80 మిలియన్ 100 మిలియన్ దిర్హామ్ ల విలువైన ఇటాలియన్ రాయిని ఉపయోగించి నిర్మించారు. దీని నిర్మాణానికి జస్ట్ 12 సంవత్సరాలు పట్టింది. ఇందులో సుమారు 9 నెలల పాటు తొమ్మిది నెలల సమయం 70 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు 7,00,000 బంగారు రేకులను పొదగడానికే సరిపోయింది.
ఇక ఈ భవన యజమానికి ఉన్న ఆర్ట్ కలెక్షన్ అలవాటు వల్ల సుమారు 400 కళాకృతులు ఈ భవనంలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. వీటిలో మరింత ప్రధానంగా 19వ మరియు 20వ శతాబ్దాల నాటి విగ్రహాలు, పెయింటింగ్ లు ఉన్నాయి.
ఇక 2020 చివరి నుండి దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ అసాధారణమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా ఇది తన విలువను కాపాడుకుంటూ వచ్చింది. అవును... కోవిడ్ మహమ్మారిని దుబాయ్ సమర్థవంతంగా నిర్వహించడం వల్ల నగరం మరింత వేగంగా తిరిగి కోలుకోగలిగింది.
ఆ సమయంలో సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రదేశాల నుండి మకాం మార్చిన వ్యక్తులను ఆకర్షించించడంలో దుబాయ్ బాగా సక్సెస్ అవ్వగా... తాజాగా రష్యా - ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ద వాతావరణం వల్ల దుబాయ్ లో రియల్ ఎస్టేట్ కు పరోక్షంగా కలిసివచ్చింది.
ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇటీవలి మెగా-డీల్స్ లో 125 మిలియన్ దిర్హామ్ లకు ఖాళీ బీచ్ ఫ్రంట్ ప్లాట్ ను విక్రయించడం, అనంతరం 420 మిలియన్ దిర్హామ్ లకు పెర్షియన్ గల్ఫ్ లో పెంట్ హౌస్ కొనుగోలు చేయడం రికార్డులుగా ఉండగా.. ఈ తాజా మార్బుల్ ప్యాలెస్ కి అతిసమీపంలో 12,500 దిర్హామ్ లకు ఎమిరేట్స్ హిల్స్ లోని ఇతర ప్రాపర్టీలు ఉండటం గమనార్హం.
కునాల్ సింగ్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నుండి పది మంది కొనుగోలుదారులు మాత్రమే ఈ భవనం ప్రత్యేక సౌందర్యం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారని తెలుస్తుంది. ఇక, గత మూడు వారాల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ భవనాన్ని సందర్శించారు. వారిలో ఒకరు ఉజ్బెక్ వ్యక్తి కాగా, ఇంకొకరు ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు ఆస్తులను కలిగి ఉన్న భారతీయ క్లయింట్ కావడం గమనార్హం.
మార్బుల్ ప్యాలెస్ అనేది వారి సంపదను ప్రదర్శించడానికి, ఉన్నత వ్యక్తులు, రాజకీయ నాయకులను వంటి వారిని అలరించాలనుకునే కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. అంటే.. వినోద ప్రయోజనాల కోసం ఒబామాలు, షేక్ ల వంటి ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించడానికి అవసరమైన ప్రవసీని, ప్రత్యేకతలను ఈ ప్యాలెస్ అందిస్తుందన్న మాట.
భవనం యొక్క ప్రాథమిక సూట్ లో స్త్రీ పురుషులకు ప్రత్యేక బాత్ రూంస్ ఉన్నాయి. రెండవ అతిపెద్ద బెడ్ రూమ్ సూట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇక అతిథి గదులు ఒక్కొక్కటి 1,000 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి. అతిథి గదుల్లో ఒకటి ప్రస్తుతం వైన్ నిల్వ చేసే ప్రదేశంగా మార్చబడింది. వీటితో పాటు అదనంగా, 12 స్టాఫ్ రూమ్ లు, 25 మంది సిబ్బంది కోసం రెండు బ్యాంక్ వాల్ట్ లు ఉన్నాయి.
ఇంత చెప్పిన తర్వాత దీని ధర చెప్పకపోతే అస్సలు బాగోదు కాబట్టి... దీని ధర 750 మిలియన్ దిర్హామ్ లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 1,675 కోట్ల రూపాయలు అన్నమాట. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఈ "మార్బుల్ ప్యాలెస్" యజమాని తన విడాకుల తర్వాత తనకోసం దీనిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం అక్కడ ఒంటరిగా నివసిస్తున్నాడు.