ప్రపంచంలోనే ఖరీదైన కండోమ్.. ధర ఎంతో తెలుసా?

Update: 2021-07-14 01:30 GMT
కండోమ్.. గర్భాన్ని నిరోధించే ఈ సాధనం గురించి అందరికీ తెలిసిందే. కిరాణా దుకాణాల నుంచి మెడికల్ షాపుల వరకూ అందరికీ ఈ కండోమ్ దొరుకుతుంది. రూ. 10కే ఒక కండోమ్ లభిస్తుంది. అంతకంటే తక్కువ ధరవి ఉన్నాయి. అయితే తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ ను తయారు చేశారు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

నిజానికి మొదట్లో కండోమ్ ల వాడకం ధనవంతుల ఇళ్లలో మాత్రమే ఉండేది. 200 సంవత్సరాల క్రితం కూడా కండోమ్ ఉండేదని.. దీనికి భారీ ధర ఉండేదని తాజాగా బయటపడింది.

కొన్ని రోజుల క్రితం స్పెయిన్ దేశంలోని చిన్న నగరంలో ఒక పెట్టే బయటపడింది. ఆ చిన్న పెట్టేలో ఏముందా? అని తీసి చూస్తే కండోమ్ బయటపడింది. 19 సెంటిమీటర్లు ఉన్న ఆ కండోమ్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. దాన్ని ప్రయోగశాలలో టెస్ట్ చేస్తే అది ఏకంగా 200 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది.

అదీగాక దాన్ని గొర్రె ప్రేగుతో తయారు చేసినట్లు తేలింది. పురాతన కాలం నాటిది కావడంతో వెంటనే వేలానికి పిలిచారు. ఈ వేలానికి చాలా మంది వచ్చారు. ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ వేలంలో చాలా మంది పాల్గొన్నారు.

200 సంవత్సరాల క్రితం నాటి కండోమ్ ను సొంతం చేసుకోవడానికి వేలంలో పోటీపడ్డారు. చివరకు అమ్ స్టర్ డామ్ కు చెందిన వ్యాపారవేత్త ఆ కండోమ్ ను దక్కించుకున్నాడు.అయితు ఈ పురాతన కాలంలో కూడా గర్భం రాకుండా కండోమ్ లు వాడారని.. అప్పుడు శస్త్రచికిత్సలు లేకపోవడంతో దీంతోనే గర్భం రాకుండా అడ్డుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికీ పురాతన కాలం నాటి కండోమ్స్ మ్యూజియంలో మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది తాజాగా గొర్రె ప్రేగుతో తయారు చేసినది బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ కండోమ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కండోమ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికాలం నాటి కండోమ్ లు కనీసం 15 సెంటిమీటర్ల పొడువు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Tags:    

Similar News