ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల సెటిల్మెంట్ గా బ్రిటన్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు రికార్డులకెక్కింది. ఈ ఖరీదైన విడాకుల కేసు దుబాయ్ రాజు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుంకు సంబంధించింది కావడం గమనార్హం. బ్రిటన్ ఫ్యామిలీ కోర్టు తాజా తీర్పు ప్రకారం తన నుండి విడాకులు తీసుకున్న భార్య హయాబింత్ అల్ హుస్సేన్ కు దుబాయ్ రాజు అక్షరాల రు. 5555 కోట్లు ఇచ్చుకోవాల్సొచ్చింది. ఇప్పటివరకు ఎంతో మంది రాజకుటుంబీకులు లేదా సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు కానీ వాళ్ళ సెటిల్మెంట్ వందల కోట్ల రూపాయల్లోనే ఉంది.
కానీ తాజా కేసులో మాత్రం చాలా తప్పులు దుబాయ్ రాజు వైపు ఉండటం, భార్య, జోర్డాన్ యువరాణి హయాంబింత్ నేపధ్యాన్ని గమనించిన బ్రిటన్ ఫ్యామిలీ కోర్టు విడాకుల సెటిల్మెంట్ ను రు. 5555 కోట్లుగా డిసైడ్ చేసింది. తన భర్త, దుబాయ్ రాజు నుంచి భార్య విడిపోయి చాలా కాలంగా ఉంటున్నారు. ఆమె చాలా కాలంగా బ్రిటన్+జోర్డాన్ లో తన ఇద్దరు పిల్లలతో కలిసుంటున్నారు. బ్రిటన్ కోర్టు తాజా తీర్పు ప్రకారం మూడు నెలల్లోగా రాణి, మాజీ భార్యకు దుబాయ్ రాజు రు. 2521 కోట్లు చెల్లించాలి.
అలాగే మిగిలిన రూ. 2907 కోట్లను తన ఇద్దరు పిల్లలకు బ్యాంకు గ్యారెంటీలతో చెల్లించాలని కోర్టు తీర్పిచ్చింది. ఈ మొత్తంలోనే పిల్లల ఏడాది మైన్ టెనెన్స్ రు. 110 కోట్లు కూడా కలిపే ఉందని కోర్టు స్పష్టంగా చెప్పింది. అసలింతకీ ఏమి జరిగిందంటే తన అంగరక్షకుల్లో ఒకరితో తన భార్య సన్నిహితంగా మెలిగిందనేది దుబాయ్ రాజు ఆరోపణలు, దీన్ని రాణి ఖండించారు. అయితే ఇదే కారణంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలై బాగా పెరిగిపోయాయి.
దాంతో తనకు+పిల్లలకు దుబాయ్ లో రక్షణ లేదని గ్రహించిన రాణి వెంటనే బ్రిటన్ కు పారిపోయింది. బ్రిటన్ కు వచ్చేసిన తర్వాతే విడాకులు కావాలని పిటీషన్ వేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి కూడా అయిన షేక్ మహ్మద్ నుంచి తన ప్రాణాలకు రక్షణ లేదని పిటీషన్ల ఆరోపించారు. అన్ని విషయాలను పరిశీలించి విచారణ జరిపిన కోర్టు చివరకు ప్రపంచంలోనే అంత్యత ఖరీదైన విడాకుల సెటిట్మెంట్ కు ఆదేశించింది.