కాలం మారింది. అందుకు తగ్గట్లే.. ఆలోచనలు మారుతున్నాయి. వాస్తవిక కోణంలో చూస్తే.. ఇలాంటివి ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఒక అమ్మాయి తన పెళ్లితోపాటు.. తన తల్లి పెళ్లిని కూడా చేయటం ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ్ కార్యక్రమం యూపీలో జరుగుతుంటుంది. అలానే తాజాగా ఈ కార్యక్రమం గోరఖ్ పూర్ లో జరిగింది.
ఈ సామూహిక వివాహమహోత్సవ కార్యక్రమంలో 63 జంటలు ఏకమయ్యాయి. అయితే.. రోటీన్ కు భిన్నంగా ఈ కార్యక్రమంలో 27 ఏళ్ల అమ్మాయి వివాహంతో పాటు.. ఆమె 53 ఏళ్ల తల్లి పెళ్లి కూడా ఇదే వేదిక మీద జరగటం విశేషం. సినిమాల్లో మాత్రమే చూసే సీన్.. తాజాగా వాస్తవంగా అందరి ముందు జరిగింది. దీంతో.. ఈ వార్త వైరల్ గా మారింది. ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. గోరఖ్ పూర్ కు చెందిన బేలి దేవి భర్త పాతికేళ్ల క్రితం మరణించారు. ఆమె ఒక్కరే.. తన ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కుమార్తెల్ని పెంచి పెద్ద చేసి.. బాధ్యతల్నిపూర్తి చేసింది. చివరగా రెండో కుమార్తె పెళ్లి మిగిలి ఉంది.
ఈ సందర్భంగా తన పెళ్లి తర్వాత తల్లి భవిష్యత్తు ఏమిటన్న చర్చ వారి కుటుంబంలో వచ్చింది. ఈ సందర్భంగా చిన్న కుమార్తె ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. తల్లి భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని.. ఆమె మరో పెళ్లి చేసుకోవాలని ఒప్పించారు. దీనిపై బేలిదేవి మాట్లాడుతూ.. ‘‘పిల్లలందరూ నేను పెళ్లి చేసుకోవటమే మంచిదిన్నారు. తన అన్న కుటుంబాన్ని చూసుకోవటానికి వారు (బేలీదేవి భర్త తమ్ముడు) పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఆయనే ఇన్నాళ్లు కుటుంబానికి అండగా నిలిచారు. అతడ్ని పెళ్లి చేసుకోవటమే మంచిదని పిల్లలు.. నేనూ భావించాం’’ అని ఆమె చెప్పారు. దీంతో.. ఒకే వేదిక మీద తల్లి.. కుమార్తె పెళ్లి జరిగిపోయాయి. వాస్తవ కోణంలో చూసినప్పుడు ఇలాంటివి మంచివే అన్న మాట వినిపిస్తోంది.