అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నకరోనా వ్యాక్సిన్ రానే వచ్చేసింది. రష్యా.. బ్రిటన్.. దుబాయ్.. లాంటి దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ ను వాడేస్తున్నారు. సామాన్యులకు ఇస్తున్నారు. దీంతో.. కరోనా మహమ్మారి నుంచి రక్షణ లభించినట్లేనని ఊపిరిపీల్చుకుంటున్న వేళ.. షాకింగ్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి. వ్యాక్సిన్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయన్న వార్తలు కలకలాన్ని రేపుతున్నాయి.
కరోనా టీకా వేయటం ప్రారంభించిన 24 గంటల్లోనే.. వ్యాక్సిన్ వాడినోళ్లలో కొందరికి సైడ్ ఎఫెక్టులు వస్తున్నట్లుగా గుర్తించారు. ఫైజర్ టీకాను బ్రిటన్ లో ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైజర్ టీకాను తీసుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మరింత జాగ్రత్తలు తీసుకోవాలని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్.. మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ కీలక ప్రకటన చేయటం గమనార్హం.
అమెరికా ఫార్మా దిగ్గజమైన ఫైజర్.. జర్మనీకి చెందిన తన భాగస్వామి సంస్థ బయోఎన్ టెక్ తో కలిసి ఈ వ్యాక్సిన్ ను రూపొందించారు. దీని క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు బాగుండటంతో అత్యవసర వినియోగానికి అనుమతుల్ని ఇచ్చారు. దీంతో.. బ్రిటన్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ముందుగా 80 ఏళ్లు దాటిన పెద్ద వయస్కుల వారికి.. ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాల్ని అందిస్తున్నారు.
ప్రస్తుతం బ్రిటన్ లో మాస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. అనుకోని రీతిలో వ్యాక్సిన్ వాడిన వారిలో కొందరికి సైడ్ ఎఫెక్టులు రావటంతో బ్రిటన్ ప్రభుత్వం అలెర్టు అయ్యింది. బ్రిటన్ ఎన్ హెచ్ఎస్ స్టాఫ్ కు టీకా ఇవ్వగా.. వారికి పాక్షిక ముఖ పక్షపాతం రావటంతో.. వారిని ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ నలుగురికి దురద.. వాంతులు.. తలనొప్పి.. ముఖంలో కండరాలు బిగుతుగా మారటం లాంటి లక్షణాలు చోటు చేసుకున్నాయి.
దీంతో.. నరాల బలహీనత ఉన్న వారు టీకాను తీసుకోవద్దన్న సూచనలు చేస్తున్నారు. అంతేకాడు.. ఎవరికైనా అలెర్జీలు ఉన్న వారు వ్యాక్సిన్ వద్దన్న సలహాల్ని ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్టులతో ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెబుతున్నారు. టీకాలు వేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎఫెక్టులకు కారణంగాఏమిటన్న అంవంపై పరిశోధనలు షురూ చేశారు. కొన్నిచోట్ల ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఫైజర్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయటం లేదు.
తమ వ్యాక్సిన్ మీద వస్తున్న కంప్లైంట్ల మీద ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బౌర్లా మాట్లాడుతూ.. టీకాల్ని తయారు చేసే సమయంలో కంపెనీ ఏ అంశాన్ని విడిచి పెట్టకుండా.. అన్నింటిని పరిగణలోకి తీసుకుంటుందన్నారు. అన్ని పరిశీలనలు చేశాకే విడుదల చేశామన్న ఆయన.. కొత్తగా వ్యాక్సిన్ వచ్చినప్పుడు వాటి పట్ల సందేహంగా ఉండే వారు ఎప్పుడూ ఉంటారని.. అలాంటి వారి సందేహాలు పూర్తిగా తప్పుగా మారినట్లు పేర్కొన్నారు. ఏమైనా.. వ్యాక్సిన్ మీద తీపి కబురు అందినట్లే అంది.. సైడ్ ఎఫెక్టులు అన్న చేదువార్త కలకలాన్ని రేపటమే కాదు.. కొత్త సందేహాలకు తావిస్తోందని చెప్పక తప్పదు.