ఏపీలో హీటెక్కించే సీట్లలో గుడివాడ ఒకటి. ఇక్కడ నుంచి నాలుగు సార్లు మాజీ మంత్రి కొడాలి నాని గెలిచారు. అయిదవ సారి ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నాని రెండు సార్లు టీడీపీ నుంచి మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. ముచ్చటగా మూడవసారి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. నానికి గుడివాడకు అవినాభావ సంబంధం ఉంది. ఆయన్ని ఓడించడం కష్టమన్న అభిప్రాయం బలపడిపోతోంది.
నాని 2014లో ఫస్ట్ టైం హరిక్రిష్ణ మద్దతుతో ఆయన సిఫార్సుతో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే సీటుని చంద్రబాబు నుంచి పొందారు. ఆయనకు ముందు రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి ఉండేవారు. ఆయనకే మొదట టికెట్ ఇద్దామనుకుంటే కొడాలి నాని సడెన్ గా రంగప్రవేశం చేసి సీటు కొట్టేశారు. ఇక 2012 ప్రాంతంలో ఆయన వైసీపీలోకి వెళ్లారు. అయినా 2014లో వైసీపీ నుంచి గెలిచారు అంటే అది ఆయన సొంత బలం కూడా అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో కొడాలి నాని గెలుపు వెనక ఎవరున్నారు. ఏ సామాజిక వర్గం ఎంత కోపరేట్ చేస్తుంది అన్న లెక్కలు కనుక చూసుకుంటే కాపులు ఎక్కువగా ఆయనకు మద్దతుగా ఉంటున్నారు అని విశ్లేషణ ఉంది గుడివాడను చూసి చాలా మంది ఇది కమ్మ జనాభా ఎక్కువగా ఉన్న సీటు అనుకుంటారు. కానీ మొత్తం రెండు లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ సీటులో లక్షా పది వేల మంది బీసీలే ఉన్నారు.
అలగే కాపులు మరో ముప్పయి అయిదు వేల దాకా ఉన్నారు. ఇక ఎస్సీలు నలభై అయిదు వేల దాకా ఉంటారు కమ్మలు మాత్రం పదిహేను వేల దాకానే ఉంటారు. ఇక కొడాలి నాని కులం మీద ఆధారపడకుండా అన్ని వర్గాలతో మంచిగా ఉండడమే గెలుపునకు కారణం అంటున్నారు. వైసీపీకి ఎస్సీలుమద్దతు ఎక్కువగా ఉంటుంది. అలా అది ప్లస్ అయింది. బీసీలను కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి వైసీపీ తిప్పుకుంది.
దాంతో ఆ ఎన్నికల్లో కొడాలి నాని 19 వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. ఇదే ఆయన మొత్తం కెరీర్ లో అతి పెద్ద మెజారిటీ. అంటే ఇక్కడ టీడీపీ కూడా గట్టిగా ఉందనే చెప్పాలి. బీసీలు కూడా టీడీపీకి దన్నుగానే ఉంటున్నారు. అయితే నానికి కాపుల మద్దతు సాలిడ్ గా దక్కుతోందని అంటున్నారు.
కానీ ఇపుడు మాత్రం సీన్ మారింది అని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కొడాలి నాని చేస్తున్న హాట్ కామెంట్స్ తో కాపులలో కొంత వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. జనసేన ఈసారి పొత్తులు ఉంటే టీడీపీకి మద్దతు ఇస్తుందని అంటున్నారు. అదే జరిగితే నానికి కష్టమే అంటున్నారు. ఎందుకిలా అంటే 2009లో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున రావి వెంకటేశ్వరరావు పోటీ చేస్తే ఇరవై ఎనిమిది వేల దాకా ఓట్లు ఆయనకు దక్కాయి. ఆ ఎన్నికల్లో నానికి 17 వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది.
ఇక 2014లో జనసేన టీడీపీకి మద్దతుగా నిలిచింది. దాంతో నాని మెజారిటీ 11 వేలకు తగ్గిపోయింది. 2019లో చూస్తే జనసేన అభ్యర్ధి నామినేషన్ని తిరస్కరించడం కూడా నాని గెలుపునకు ప్లస్ అయింది అంటున్నారు. దాంతో ఆయన నాలుగవ సారి గెలిచారు. ఇక నానికి వంగవీటి రంగా తనయుడు రాధాతో స్నేహం కూడా కలసి వస్తోందని అంటున్నారు. రాధా నాని నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయరు. అయితే ఈసారి వంగవీటి రాధా మిత్రమండలి ఆద్వర్యంలో గుడివాడలో నానికి యాంటీగా ప్రచారం స్టార్ట్ అయింది.
జనసేన కూడా గట్టిగా ఉంది. టీడీపీ అయితే నానిని ఓడించాలని పట్టుదల మీద ఉంది. దాంతో ముప్పయి అయిదు వేల కాపు ఓట్లు కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా ఏదో విధంగా మెజారిటీ కాపుల ఓట్లు తన ఖాతాలో వేసుకుని గెలుస్తున్న నానికి ఇపుడు అగ్ని పరీక్షగా ఉంది అంటున్నారు. 2024లో ఆయన్ని ఓడించాలన్న తెలుగుదేశం జనసేన పంతం చూస్తే నాని కచ్చితంగా కొత్త వ్యూహాలనే పన్నాల్సి ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.